Entertainment

Nag-Tabu: నాగ్ - టబు క్రేజీ కాంబోకు అంతా సెట్..

కింగ్ నాగార్జున, టబు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వీరిద్దరి కాంబోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రేజీ కాంబోకు అంతా సెట్ అయ్యింది. అప్పుడెప్పుడో కొన్నేళ్ల క్రితం వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట తిరిగి మరోసారి ఇంత కాలానికి జత కట్టారు.

Nag-Tabu: నాగ్ - టబు క్రేజీ కాంబోకు అంతా సెట్..

కింగ్ నాగార్జున, టబు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వీరిద్దరి కాంబోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రేజీ కాంబోకు అంతా సెట్ అయ్యింది. అప్పుడెప్పుడో కొన్నేళ్ల క్రితం వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట తిరిగి మరోసారి ఇంత కాలానికి జత కట్టారు. ప్రస్తుతం నాగార్జున 100వ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ #King100 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా కార్తిక్ పరిచయం కానున్నాడు. నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

నాగ్ 100వ చిత్రంలో టబు ఉంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని భావించిన మేకర్స్ ఆమెను ఓ కీలక పాత్ర కోసం ఒప్పించారట. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లో సైతం జాయిన్ అయ్యారు. నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో పాటు ఈ జోడీ మళ్లీ తెరపై కనిపిస్తోందనే వార్తల నడుమ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. గతంలో నాగ్-టబు కాంబినేషన్‌లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి చిత్రాలొచ్చిన విషయం తెలిసిందే. ‘నిన్నేపెళ్లాడతా’ అయితే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘శిశింద్రీ’లో కూడా టబు ప్రత్యేకంగా కనిపించారు. ఇంత కాలానికి ఆ జంట మరోసారి వెండితెరపై మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతుంది.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 29, 2026 7:29 AM