Gayapadda Simham Review: ‘గాయపడ్డ సింహం’ ప్రేక్షకులను అలరించిందా?
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. ముఖ్యంగా జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు వంటి ముఖ్య తారాగణం నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌తో పాటు మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అని టాక్ రావడంతో సినిమాపై ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరిచారు.
చిత్రం: గాయపడ్డ సింహం
విడుదల తేదీ: 01-05-2026
నటీనటులు: తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి, కశ్యప్ శ్రీనివాస్, శుభలేఖ సుధాకర్, విష్ణు ఓయ్
డైరెక్టర్: కశ్యప్ శ్రీనివాస్
మ్యూజిక్: స్వీకర్ అగస్తి
నిర్మాత: భాను ప్రతాప, పవన్ సాదినేని, కళ్యాణ్ చక్రవర్తి, ఉమేష్ కుమార్ బన్సల్
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. ముఖ్యంగా జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు వంటి ముఖ్య తారాగణం నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌తో పాటు మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అని టాక్ రావడంతో సినిమాపై ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరిచారు. మరి సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉందా? చూద్దాం.
కథేంటంటే..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన దరహాస్ (తరుణ్ భాస్కర్).. సాయి గాయత్రి (మానస చౌదరి)ని ప్రేమిస్తాడు. అయితే వీరి పెళ్లికి గాయత్రి తండ్రి అడ్డు చెబుతాడు. అమెరికా వెళితేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు. దీంతో కష్టమైనా అమెరికాకు వీసా సంపాదించి వెళతాడు. కానీ ట్రంప్ తీసుకొచ్చిన పాలసీల కారణంగా యూఎస్ ఎయిర్‌పోర్టు నుంచే డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. అలా వెనక్కి తిరిగి వచ్చిన వారిలో దరహాస్ కూడా ఒకడు. దరహాస్ అమెరికా నుంచి వచ్చేయడంతో సాయి గాయత్రి అతనికి బ్రేకప్ చెబుతుంది. దీంతో అతను మానసిక సంఘర్షణకు లోనవుతాడు. అలాగే సైకలాజికల్‌గా సఫర్ అవుతుంటాడు. దీంతో ట్రంప్‌పై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. మరి రివెంజ్ తీర్చుకోవడం కోసం దరహాస్ ఏం చేశాడు? అతని కథలోకి భైరవ (శ్రీ విష్ణు), బ్రూతల్ ధర్మ (జేడీ చక్రవర్తి) ఎలా ఎంటర్ అయ్యారు. దరహాస్ జీవితంలోకి ఫరియా అబ్దుల్లా ఎలా ఎంటర్ అవుతుంది? వంటి అంశాలను వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
ఇదొక కామెడీ రివెంజ్ డ్రామా. ఒక సెలబ్రిటీని మెయిన్ సెంటర్‌గా పెట్టి రాసుకున్న కథ. అమెరికా ప్రస్తుత పరిస్థితులు.. దానికి ట్రంప్ కారణమవడంతో.. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని జర్నలిస్ట్ అయిన సూర్యప్రకాశ్ జ్యోతుల అందించిన కథను కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రంప్ చుట్టూ కథ నడపడం అనేది ఆసక్తికరమే అయినా కూడా అందించిన విధానమే అంత ఆకట్టుకునేలా లేదు. పేరుకే కామెడీ ఎంటర్‌టైనర్ కానీ సినిమాలో కశ్యప్ అంతగా కామెడీని అయితే పండించలేకపోయారు. ఫస్టాఫ్ అంతా నటీనటుల పరిచయం, దరహాస్‌ను గాయత్రి ఎందుకు వదిలేయాల్సి వచ్చిందనే అంశాలతో రూపొందించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో రివెంజ్ డ్రామాను నడిపించారు. వినూత్న కాన్సెప్ట్ అని చెప్పాలి. కానీ దానిని ప్రెజెంట్ చేసిన తీరే అంత ఆకట్టుకోలేదు.
నటీనటుల పనితీరు:
తరుణ్ భాస్కర్ మంచి నటుడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. అలాగే జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు సైతం అద్భుతంగా నటించారు. అతని స్నేహితుడి పాత్రలో నటించిన దర్శకుడు కశ్యప్, విష్ణు ఓయ్ చక్కగా నటించారు. శుభలేఖ సుధాకర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
రచయిత రాసుకున్న కథ బాగుంది కానీ, దర్శకుడు కశ్యప్ దానిని తెరకెక్కించే క్రమంలోనే తడబడ్డాడు. సంగీతం అయితే పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకి సెట్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఫైనల్‌గా: ‘గాయపడ్డ సింహం’ అంతంత మాత్రంగానే ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.5/5