Entertainment

ChiruBobby2: మళ్లీ బాబీకి చిరు గ్రీన్ సిగ్నల్.. లుక్ టెస్ట్ కంప్లీట్..

చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ని మరోసారి వాడిన డైరెక్టర్ బాబీ కొల్లి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి సక్సెస్ సాధించింది. తిరిగి వీరిద్దరి కాంబోలో మూవీకి సర్వం సిద్ధమవుతోంది.

ChiruBobby2: మళ్లీ బాబీకి చిరు గ్రీన్ సిగ్నల్.. లుక్ టెస్ట్ కంప్లీట్..

చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ని మరోసారి వాడిన డైరెక్టర్ బాబీ కొల్లి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి సక్సెస్ సాధించింది. తిరిగి వీరిద్దరి కాంబోలో మూవీకి సర్వం సిద్ధమవుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి‌తో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే #ChiruBobby2 చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్‌లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.

లుక్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫోటోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ఫోటో చూస్తుంటే.. చిరంజీవి కొత్త షేడ్‌లో కనిపించనున్నట్లు గా అనిపిస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్ అయ్యీ అవగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మాస్ ఎంటర్టైన్మెంట్‌ను తనదైన స్టైల్‌లో అద్భుతంగా అందించే బాబీ కొల్లి.. ఈ సారి చిరును ఎలా చూపించబోతున్నారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ కాంబో నుంచి హై-ఆక్టేన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అయితే వీరి నుంచి రాబోతుందని టాక్. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే విడుదల చేయనున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 29, 2026 9:54 AM