First Time: చిన్న బడ్జెటే కానీ విజువల్ గ్రాండియర్‌గా ‘ఫస్ట్ టైం’
హేమంత్ ఇప్పలపల్లి ఒక ఆసక్తికర కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైం’. భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వీఎఫ్ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న "ఫస్ట్ టైం" సినిమాకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.
హేమంత్ ఇప్పలపల్లి ఒక ఆసక్తికర కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైం’. భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వీఎఫ్ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న "ఫస్ట్ టైం" సినిమాకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హాజరై.. ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా.. అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు.
ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. వాస్తవానికి ఇది చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికాలిటీస్, విజువల్స్ పరంగా చాలా గ్రాండియర్‌గా కనిపిస్తోంది. ఏఐ (Artificial Intelligence)ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా హెచ్‌ఐ( Human Intelligence) తోనే హై రేంజ్ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అతిథులుగా సీనియర్ నిర్మాత దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభ గౌడ్, జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్, హీరో అభినవ్ శౌర్య హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దేవగుడి చిత్ర నటుడు 'అభినవ్ శౌర్య' మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్ చాలా బాగుందని.. హాలీవుడ్ స్థాయిలో ఉందన్నారు. రాజమౌళిని అభిమానించే హేమంత్ చిత్రాలు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నానన్నారు. బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభ గౌడ్ మాట్లాడుతూ .. ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూసిన వెంటనే తనకు మన సంస్కృతి, మన మూలాలు, మన ధర్మం గుర్తొచ్చాయన్నారు. మన మట్టికి సంబంధించిన మూలాలను ఈ సినిమాకి అటాచ్ చేసినట్లు అర్థమవుతుందన్నారు. నటి 'గాయత్రి గుప్తా' మాట్లాడుతూ.. దర్శకులు తనను ఆడిషన్ కూడా చేయకుండా తీసుకున్నారని.. తొలి దర్శకులు అన్నప్పుడు సాధారణంగా నమ్మకం ఉండదని.. కానీ హేమంత్ విజనే వేరని తెలిపింది. ఆయనతో కలిసి పని చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది.
హీరో 'సౌరబ్ ధింగ్ర' మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టిందన్నాడు. ఈ సినిమా పూర్తి చేయడానికి హేమంత్ చాలా కష్టపడ్డారని.. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ కోసం చాలా కృషి చేశారన్నారు. సీనియర్ దర్శక నిర్మాత.. 'బెల్లం రామక్రిష్ణ రెడ్డి గారు' మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్‌లో చూపించిన గ్రాఫిక్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. హాలీవుడ్ రేంజ్ లో అనిపించిందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. చిత్ర దర్శక నిర్మాత 'హేమంత్ ఇప్పలపల్లి' మాట్లాడుతూ.. తాను గురువుగా భావించే వ్యక్తి రాజమౌళి అని తెలిపారు. ఆయన దగ్గర పని చేయనప్పటికీ ఆయన సినిమాలే తనకు ప్రేరణ అన్నారు. మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించినట్టు తెలిపారు.
ముఖ్య అతిథి నటి 'పాయల్ రాజ్ పుత్' మాట్లాడుతూ.. కొంతకాలం గ్యాప్ తర్వాత మీ అందరిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొన్ని తమిళ పంజాబీ చిత్రాల వల్ల తాను హైదరాబాద్‌కు రాలేకపోతున్నానని.. తెలుగు మీడియా వారిని మరోసారి ఇలా కలవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించిందన్నారు. ప్రస్తుతం సినిమా చాలా మారిపోయిందని.. గత రోజులతో పోలిస్తే ఇప్పుడు కథలు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఎంతో కొత్తగా అనిపించిందని.. ముఖ్యంగా సినిమాలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చూస్తే షాకింగ్ గా ఉన్నాయన్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తానని కోరకుంటున్నట్టు పాయల్ తెలిపారు.