CM Chandrababu: ఇంత చేసి చెప్పాలి కదా.. లేదంటే ఎలా?
ఉత్తరాంధ్రకు చెందిన హోమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha), అచ్చెన్నాయుడు (Atchennaidu) వంటివారు దీనిని చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరినీ చంద్రబాబు తన ఛాంబర్‌కు పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నారట..

ఓ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) డైలాగ్ ఒకటుంటుంది. సిగిరెట్ పెట్టె మీద కూడా ‘నన్ను తాగకండి.. తాగితే పోతారు’ అని రాసిపెట్టి ఉంటుంది... అలాగే మన గురించి కూడా మనం చెప్పుకోవాలి. వేరొకరు ఎవరూ వచ్చి మన డప్పు కొట్టరు. ఈ విషయంపైనే సీఎం చంద్రబాబు (CM Chandrababu).. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు క్లాస్ తీసుకుంటున్నారు. ఒక్కోసారి క్లాస్ పరిధి దాటి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అయినా సరే తీరు మారితేనా?
తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ (AP Cabinet Meeting)లో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులను తన చాంబర్‌కి పిలిపించి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) క్లాస్ తీసుకున్నారని సమాచారం. అసలేం జరిగిందంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏదో ఒక అభివృద్ధి పనికి శ్రీకారం చుడుతూనే ఉంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విజయనగరం, శ్రీకాకుళం (Srikakulam), విశాఖపట్నం (Visakhapatnam)లో పలు పరిశ్రమలను తీసుకువస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport)ను అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయడంతో పాటు విశాఖలో లులు (LuLu Mall) సహా ఐటీ (IT), గూగుల్ (Google) వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకువస్తున్నారు. తద్వారా కొన్ని వేల మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటి వరకూ ఉద్యోగాలు వెదుక్కుంటూ అక్కడి యువత హైదరాబాద్ లేదంటే బెంగుళూరుకు పయనమయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
స్వంత రాష్ట్రంలోనే ఉపాధి లభిస్తోంది. అలాంటప్పుడు ఈ విషయాన్ని ఎంతలా జనాల్లోకి తీసుకెళ్లాలి? కానీ ఉత్తరాంధ్రకు చెందిన హోమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha), అచ్చెన్నాయుడు (Atchennaidu) వంటివారు దీనిని చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరినీ చంద్రబాబు తన ఛాంబర్‌కు పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరు మాత్రమే కాదు.. కొందరు నేతలు సైతం ప్రజలతో అంత కలివిడిగా లేరని తెలుస్తోంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో నేతలు ఫెయిల్ అవుతున్నారని టాక్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కొద్ది రోజుల క్రితం కూడా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు మంత్రుల వంతు వచ్చేసింది. మొత్తానికి చంద్రబాబు (Chandrababu) అయితే ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల