Chandrababu: విశ్వవ్యాప్త తెలుగు కీర్తి.. అపర భగీరథుడు చంద్రబాబునాయుడు..!
విజన్ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే విజన్! ఇది నేడు తెలుగు నేలనే కాదు, యావత్ ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న వాస్తవం. తెలుగు వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నేడు వారి పాస్‌పోర్టుల వెనుక ఒక నిశ్శబ్ద సైనికుడి కృషి ఉంది.
విజన్ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే విజన్! ఇది నేడు తెలుగు నేలనే కాదు, యావత్ ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న వాస్తవం. తెలుగు వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నేడు వారి పాస్‌పోర్టుల వెనుక ఒక నిశ్శబ్ద సైనికుడి కృషి ఉంది. 195 దేశాల్లో తెలుగు వారు సగర్వంగా తలెత్తుకుని జీవిస్తున్నారంటే, దానికి పునాది వేసిన అపర మేధావి నారా చంద్రబాబు నాయుడు.
30 ఏళ్ల క్రితం ఐటీ అనే పదం వింటేనే భయపడే రోజుల్లో, కంప్యూటర్ పట్టడం కూడా నేరం అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో.. చంద్రబాబు ఒక అద్భుత స్వప్నం కన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చాలని ఆయన తీసుకున్న నిర్ణయం నేడు కోట్లాది మంది తెలుగు యువత జీవితాల్లో వెలుగులు నింపింది. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు రప్పించడం ద్వారా, కేవలం ఒక నగరాన్నే కాదు.. తెలుగు వాడి మేధస్సును గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేశారు. ఆనాడు ఆయన సైబర్ టవర్స్ కట్టకపోతే, నేడు మన తెలుగు బిడ్డలు సిలికాన్ వ్యాలీలో సత్తా చాటే వారు కాదేమో!
గ్లోబల్ తెలుగు ప్లాట్‌ఫారమ్!
‘195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం నేనే’ అని చంద్రబాబు చెప్పడం అతిశయోక్తి కాదు, అది అక్షర సత్యం. తెలుగు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేలా ప్రోత్సహించి, వారికి కావాల్సిన అవకాశాలను సృష్టించింది ఆయనే. నేడు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతల్లో తెలుగు వారు ఉన్నారంటే, దానికి బాబు వేసిన విద్యా, పారిశ్రామిక పునాదులే కారణం. సత్య నాదెళ్ల వంటి నాయకులు అంతర్జాతీయ వేదికపై మెరుస్తున్నారంటే, ఆనాడు సీబీఎన్ సృష్టించిన అనుకూల వాతావరణమే స్ఫూర్తి. విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి అనే ఒక అద్భుత రాజధానిని కానుకగా ఇవ్వాలని ఆయన పడుతున్న తపన అనన్యం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒక నగరాన్ని నిర్మించడం అంటే సామాన్య విషయం కాదు. అడ్డంకులు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తెలుగు వాడి ఆత్మగౌరవం అమరావతి రూపంలో ఆకాశాన్ని తాకాలని ఆయన చూస్తున్న విజన్ ఒక చారిత్రక ఘట్టం. చంద్రన్న చేతుల్లో అమరావతి రూపుదిద్దుకుంటే, అది సింగపూర్ కంటే మిన్నగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
సెల్ఫ్ డబ్బా 2.0..!
చంద్రబాబు మైక్ పట్టుకున్నారంటే చాలు.. కాలచక్రం వెనక్కి తిరుగుతుంది, చరిత్ర తిరగరాయబడుతుంది. 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం తానే అని సెలవిచ్చారు. ఇది విన్న సగటు తెలుగువాడికి ‘తాతాచార్యుల ముద్ర.. బాబుగారి భద్ర’ అన్న సామెత గుర్తొస్తోంది. అప్పట్లో ఐటీ హ్యాండిల్ పట్టుకోమని ఆయన చెప్పారట, అందుకే ఇప్పుడు అమెరికాలో తెలుగువాడు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లను ఏలుతున్నాడట! ఆయన మాటలు వింటుంటే.. పాపం విదేశాల్లో రాత్రింబవళ్లు కష్టపడి, డాలర్ల కోసం చమటోడుస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు తమ సొంత తెలివితేటల మీద అనుమానం రావడం ఖాయం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, సకల జనుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం చూస్తుంటే గుమ్మడికాయంత గొప్పలు.. ఆవగింజంత పనులు అన్న చందంగా ఉంది. బిల్ గేట్స్‌కు బిజినెస్ నేర్పింది, సత్య నాదెళ్లను సీఈవో చేసింది, ఇప్పుడు ప్రపంచంలోని 195 దేశాలకు తెలుగువారిని ఎగుమతి చేసింది.. అంతా బాబు విజన్ మహిమేనట! ఈ లెక్కన రేపు చంద్రమండలం మీద తెలుగువాడు అడుగుపెట్టినా.. అక్కడకు రాకెట్ పంపింది కూడా చంద్రన్నేనని గ్రాఫిక్స్ వేసి చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ‘చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం’ అంటే ఇదేనేమో! అనే విమర్
యుగపురుషుడు.. నవయుగ నిర్మాత!
చంద్రబాబు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప స్ట్రాటజిస్ట్. రాబోయే 25 ఏళ్ల అవసరాలను ముందే ఊహించి ప్రణాళికలు సిద్ధం చేసే ఆయన తీరు మరే నాయకుడిలోనూ కనిపించదు. అందుకే ఆయనను 'ఆధునిక భీష్ముడు' అని పిలుచుకుంటారు. రాజకీయాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత ఆయనది. తెలుగు వాడు ఎక్కడ ఉన్నా.. నేను ఉన్నాను" అని ఆయన ఇచ్చే భరోసా కోట్ల మందికి ధైర్యం. బాబు గారు వేసిన బాటలోనే నేడు తెలుగు బిడ్డలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అలాంటి దార్శనికుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత.. చంద్రబాబు నాయుడు గారికి యావత్ తెలుగు లోకం రుణపడి ఉంటుంది!
ప్రజావాణి చీదిరాల