TG News: తెలంగాణ ప్రభుత్వాన్ని మూసి ముంచేస్తుందా?
చిన్నదో.. పెద్దదో ఏదో ఒకటి.. మనకంటూ సొంత గూడొకటి ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఇది పెను భారమే.
చిన్నదో.. పెద్దదో ఏదో ఒకటి.. మనకంటూ సొంత గూడొకటి ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఇది పెను భారమే. దీని కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు.. కడుపు మాడ్చుకున్న క్షణాలు కోకొల్లలు ఉంటాయి. అలాంటి గూడును నేలమట్టం చేస్తే వారి పరిస్థితేంటి? దీనిని ఎవరైనా సమర్థించగలరా?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువు నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పింది. అలాగే దీనికోసం హైడ్రాను నియమించింది. తొలుత కొందరు బడాబాబుల ఇళ్లను కూల్చేసింది. దానికి అంతా హర్షించారు. కానీ సామాన్యుల జోలికి వచ్చేసరికి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు ల్యాండ్ పేపర్స్ సరిగా ఉన్నాయా? లేవా? అనేది మాత్రమే చూసుకుంటారు తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. అలాంటి జీవితాల నుంచి గూడును దూరం చేస్తే..
సాహసం చేయని బీఆర్ఎస్..
హైదరాబాద్‌లో మూసి ప్రక్షాళన పేరిట ఇళ్ల కూల్చివేత.. ఖమ్మంలో ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్నవెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 650 ఇళ్ల కూల్చివేత వంటి ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కేలా చేస్తున్నాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందా? అంటే కచ్చితంగా మైనస్ అవుతుందనడంలో సందేహమే లేదు. అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఇలాంటి దుశ్చర్యకు అయితే పాల్పడే సాహసం చేయలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాయి.
బీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వంటి వారు రంగంలోకి దిగారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ అనే నినాదంతో భారీగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. పైగా కేటీఆర్ 4గటచేశారు. అయితే బాధితులు చేపట్టిన ఈ మూసీ దండి మార్చ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప నిర్వాసితులతో కేటీఆర్ మాట్లాడి వారికి భరోసా కల్పించారు. మొత్తానికి ఈ వివాదం బీఆర్ఎస్‌కు ప్లస్‌గానూ.. కాంగ్రెస్‌కు మైనస్‌గానూ పరిణమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆందోళనలు, కన్నీటి గాథలు. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేతలతో పాటు మూసి అంశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముంచేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.