Chandrababu: చంద్రబాబు మాటలపై ఎందుకింత రచ్చ? అసలాయన చెప్పిందేంటి?
ఏంటో ఈ జనాలు బోడిగుండుకి.. మోకాలుకి ముడి పెట్టేస్తూ ఉంటారు. ఒక మాటని మంచికీ వాడొచ్చు.. చెడుకి వాడొచ్చు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టీం చెడుకే వాడేస్తోంది.
ఏంటో ఈ జనాలు బోడిగుండుకి.. మోకాలుకి ముడి పెట్టేస్తూ ఉంటారు. ఒక మాటని మంచికీ వాడొచ్చు.. చెడుకి వాడొచ్చు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టీం చెడుకే వాడేస్తోంది. తాజాగా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కల్తీ నెయ్యి వ్యవహారమై మాట్లాడారు. పనిలో పనిగా ఆయన హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని హిందువుల నమ్మకమని తెలిపారు. అలాగే విడాకులు హిందూమతంలో లేవని.. భార్యాపిల్లలు అన్యోన్యంగా జీవించాలని హిందూ మతం చెబుతోందన్నారు. దీనికి పవన్ కల్యాణ్‌కి ముడిపెట్టి ఆయన హిందూ మతానికి చెందిన వారు కాదని.. సనాతని కాదంటూ నానా రచ్చ చేస్తున్నారు.
చంద్రబాబు మాటల పరమార్థం అదేనా?
వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వచ్చేసి పవన్ ప్రస్తావన తీసుకువచ్చినా కూడా ఏదో లైటర్ వేలో తీసుకెళ్లారు. కానీ వైసీపీ సోషల్ మీడియా టీం మాత్రం పనిగట్టుకుని మరీ ఆయనపై దుష్ప్రచారాన్ని మొదలు పెట్టింది. అసలు చంద్రబాబు మాటల పరమార్థం అదేనా? ఆయన ఓవరాల్‌గా మాట్లాడితే దానిని తీసుకెళ్లి పవన్‌కు అంటగట్టడంలో ఆంతర్యమేంటి? సమాజంలో పెళ్లిళ్లు చేసుకున్నవారు లేరా? పోనీ ఆయన మాజీ భార్యలు వచ్చి తాము అన్యాయమై పోయామని మీ దగ్గర మొరపెట్టుకుంటున్నారా? ఆయన పిల్లలు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? అది కాదన్నా పిల్లల్ని గాలికి వదిలేశారా? చక్కగానే చూసుకుంటున్నారు. ఆయన ఎటైనా వెళితే పెద్ద కొడుకును వెంటబెట్టుకుని మరీ వెళుతున్నారు. ఒకరకంగా ఆయన రాజకీయ వారసుడు అకీర నందనేన్న సంకేతాలను సైతం ఇస్తున్నారు. ఇంకా ఎందుకింత రచ్చ?
అప్పుడు కార్నర్ చేసినా..
పవన్ కారణంగా ఎవరైనా నష్టపోతే.. లేదంటే ఇబ్బంది పడ్డామని వచ్చి మొరపెట్టుకుంటే ఆయనను కార్నర్ చేసినా ఓ పద్ధతి. కానీ చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడిన మాటలను తీసుకెళ్లి పవన్‌కు అంటగట్టడంలో అర్థమే లేదు. ఇలా ఒకరి మాటలను మరొకరికి అన్వయించుకుంటూ పోతే.. ఇక సమాజంలో ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేరు. చంద్రబాబు హిందూత్వం గురించి ఎన్నో విషయాలను చెప్పారు. మంచిని వదిలేసి ఒక మాటను పట్టుకుని వేలాడే వారిని ఏమనాలి? సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ఈ విపరీతాలు మరీ తీవ్రతరమవుతున్నాయి. ఒకరి మాటలను షార్ట్ కట్ చేసి ఆ వీడియో బైట్‌ని సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. దీంతో అర్థమే మారిపోతోంది. అయితే అలాంటివే బీభత్సంగా వైరల్ అవుతుండటం గమనార్హం.
ప్రజావాణి చీదిరాల