BJP: బీజేపీ అప్పుడు నీవెక్కడ? సెప్టెంబర్ 17పై రచ్చ చేసే రైట్ నీకుందా?
ప్రతి ఒక్క విషయాన్నీ రాజకీయం చేయకూడదు.. కొన్ని విషయాల్లో కొందరు కల్పించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ కల్పించుకోవాలనుకుంటే దానికి మద్దతు ఇచ్చి ఊరుకుంటే మర్యాదగా ఉంటుందని తెలంగాణ ప్రజానీకం అంటోంది.

ప్రతి ఒక్క విషయాన్నీ రాజకీయం చేయకూడదు.. కొన్ని విషయాల్లో కొందరు కల్పించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ కల్పించుకోవాలనుకుంటే దానికి మద్దతు ఇచ్చి ఊరుకుంటే మర్యాదగా ఉంటుంది. లేదు.. కాదు.. అని అన్నింటిలోనూ వేలు పెడితే పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు లాగి ఏకిపారేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది అవసరమా? అలవి కాని చోట తగ్గి ఉంటే తప్పేముంది?
ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? తెలంగాణ (Telangana)లో సెప్టెంబర్ 17 వస్తోందంటే చాలు.. బీజేపీ (BJP) తగుదునమ్మా అంటూ తయారైపోతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అసలు సెప్టెంబర్ 17తో బీజేపీకేంటి సంబంధం? ఆ సమయంలో బీజేపీ ఎక్కడుంది? కనీసం భారతీయ జన సంఘ్ అయినా ఉందా? బీజేపీ ఎప్పుడు పుట్టింది? తెలంగాణ విమోచనం (Telangana Liberation) ఎప్పుడు జరిగింది? ఈ మూడు తెలిస్తే అసలు విషయం ఏంటనేది అందరికీ క్లియర్‌గా అర్థమవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాజకీయాలు చేసే చోట చేయాలి కానీ అన్ని విషయాల్లో కాదు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు.. విలీనమా ?, విమోచనా ? విద్రోహమా ? అంటూ కొత్త చర్చకు తెరదీసి నానా రచ్చ చేసి కాని వదలరు. ఆ మాటకొస్తే అప్పుడు బీఆర్ఎస్ ఎక్కడుంది? అనవచ్చేమో.. అది తెలంగాణ పార్టీ.. తెలంగాణలో పుట్టిన పార్టీ. అయినా ఈ పార్టీ ఏమీ రచ్చకు తెరదీయడం లేదు. తీస్తే పరిణామాలు తెలుసు కాబట్టి గప్ చుప్.
సెప్టెంబర్ 17 ప్రత్యేకత ఏంటి?
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అయినా అప్పటికీ నిజాం (Nijam) పాలనలోని దక్కన్ ప్రాంతానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. దీనికి కారణం భారతదేశంతో ఈ సంస్థానానికి సంబంధం లేకపోవడమే. సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియను భారత ప్రభుత్వం చేపట్టినా నిజాం నవాబు అంగీకరించలేదు. స్వతంత్రంగానే ఉంటామని.. అవసరమైతే పాక్‌లో కలుస్తామని తెగేసి చెప్పారు. కానీ దేశం మధ్యలో ఉన్న భూభాగాన్ని భారత్ ఎలా వదులుకుంటుంది? ఈ క్రమంలోనే అప్పటి కేంద్ర హోంమంత్రి ‘అపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్య నిర్వహించి తెలంగాణకు నిజాం నవాబుల నుంచి విముక్తి కల్పించారు. ఆపరేషన్ పోలో (Operation Polo) కారణంగా తెలంగాణతో పాటు మరాఠ్వాడా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నాయి. భారత సైన్యం (Indian Army) 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానం (Hyderabad State) ముట్టడిని నలువైపుల నుంచి ప్రారంభించి సెప్టెంబర్ 17న సాయంత్రం సుమారు 5 గంటల కల్లా పని పూర్తి చేసింది. భారత ఆర్మీ హైదరాబాద్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17 విషయంలో బీజేపీ చేస్తున్న రాద్దాంతం అంతా ఇంతా కాదు.
బీజేపీ ఎప్పుడు పుట్టింది?
అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee), లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani)లు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ఇక ఈ పార్టీకి ఎక్కడ సెప్టెంబర్ 17తో సంబంధం ఉంది? పోనీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (Syam Prasad Mukharji) స్థాపించిన భారతీయ జన సంఘ్ నుంచే కదా ఈ పార్టీ ఉద్భవించింది అంటారా? అసలు ఆ పార్టీని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో స్థాపించారు. హిందూ మహాసభను విడిచి పెట్టి ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా స్థాపించిన పార్టీయే జనతా పార్టీ. ఆ తరువాతి కాలంలో జనసంఘ్ అనేక ఇతర రాజకీయ పార్టీలతో కలిసి 1977 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ (Congress)ను ఓడించింది. 1980లో జనతా పార్టీ రద్దై.. ఆ తరువాత బీజేపీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత వచ్చిన అంటే 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్ (Uttarpradsh)లోని రామ జన్మభూమి (Rama Janmabhoomi) కారణంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో అది బలం పుంజుకున 1996 నాటికి అతి పెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించింది.
రచ్చ ఎందుకు?
ఇక 1925లోనే ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది కదా అంటే.. అది కేవలం హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకే పరిమితమైందని చెప్పాలి. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకంత ఆతృత? ఎందుకు రచ్చ చేయడం? అసలు రచ్చ చేసే రైట్ ఎక్కడుంది? అంటే తెలంగాణ బీజేపీ అనవచ్చేమో.. అదైనా ఎప్పుడు రచ్చ చేయాలి? అంటే.. అసలు కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17ను పట్టించుకోనప్పుడు చేయాలి. అప్పుడు బీజేపీయే కాదు.. సామాన్య జనం కూడా ఊరుకోరు. కాంగ్రెస్‌ను ఏకిపారేస్తారు. విద్రోహమా? విలీనమా? విమోచనమా? అనే విషయాలపైనా రాద్దాంతం? పనికొచ్చే విషయాలపై పోరాడితే దానికో ఫలితం ఉంటుంది. ఇలాంటి విషయాలపై పోరాడటం వలన వచ్చేదేం లేదు. జనాల్లో పార్టీపై అసహనం తప్ప.
ప్రజావాణి చీదిరాల