AP News: ఏపీలో ఏం జరుగుతోంది? ఈడీ ఎందుకు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది?
ఏపీలోని కూటమి ప్రభుత్వం సైలెంటుగా తన పని తాను చేసుకుపోతోందా? లేదంటే జనం ఏదో జరుగబోతోందంటూ ఊహించుకుంటున్నారా? అసలేం జరుగుతోంది. వాస్తవానికి ఈడీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ ఉండదు..

ఏపీలోని కూటమి ప్రభుత్వం సైలెంటుగా తన పని తాను చేసుకుపోతోందా? లేదంటే జనం ఏదో జరుగబోతోందంటూ ఊహించుకుంటున్నారా? అసలేం జరుగుతోంది. వాస్తవానికి ఈడీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ ఉండదు.. అయితే ఎందుకు సడెన్‌గా ఏపీపై న్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు చేస్తున్నారు. మనీ ట్రయల్ జరిగితే ఈడీ ఎంటరైపోతుంది? మరి ఏపీలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది? అసలు ఏపీలో ఏం జరుగబోతోంది? ఎందుకు ఈ వార్తలన్నీ సడెన్‌గా? తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలలో ఈడీ దాడులు జరిగాయి. ఏపీలో అయితే ఇది వైసీపీ (YCP) కేంద్రంగానే జరిగాయి. అంటే వైఎస్సార్‌సీపీ (YSRCP) హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేంద్రంగానే జరిగాయి. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో అత్యధికంగా మద్యం సప్లై (Liquor Suply) ఆఫర్లను నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్న కంపెనీలు, డిస్టలరీలే కంద్రంగా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఏకకాలంలో ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి (Raj Kesireddy) సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి, యూవీ డిస్టిలరీస్ (UV Distilleries) యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డి (Teegala Vijender Reddy) డైరెక్టర్లుగా ఉన్న అరేట్ ఆసుపత్రి సహా పలు చోట్ల సోదాలు జరిగాయి. మొత్తంగా పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు (ED Raids) నిర్వహంచింది. అది చూసిన వారంతా ఇంకేముంది? వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం (Liquor scandal)పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అయ్యింది.
మరింత కష్టాల్లోకి వైసీపీ..
ఏకకాలంలో 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి 10 వరకూ కొనసాగాయి. తనిఖీల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఏపీలో వైసీపీ మరింత కష్టాల్లో కూరుకుపోతోంది. దీనిని ఆ పార్టీ అధనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఎలా సమర్ధించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అసలు దీనిపై పెదవి విప్పుతారా? లేదంటే ఏమాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందోనని సైలెంట్ అవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో కొందరు వైసీపీ నేతలు (YCP Leaders) అరెస్టై జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ దర్యాప్తు అధినేత మెడకు చుట్టుకోవడం కూడా ఖాయంగానే కనిపిస్తోందని ఏపీ ప్రజానీకం భావిస్తోంది. ఈ వ్యవహారమంతా సైలెంట్‌గా జరిగిపోతోంది. అటు ఈడీ అధికారులు ఏమీ మాట్లాడటం లేదు. మరి ముందుగానే ఆదేశాలు అందాయో ఏమో కానీ కూటమి నేతలు దీని గురించి ఎక్కడా పెదవి విప్పడం లేదు.
డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము..
మరోవైపు వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా మద్యం సప్లై ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టరీలు చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ముడుపుల సొమ్ము వసూలు చేసేందుకు వైసీపీ ఎన్నో మార్గాలను అనుసరించి ఏపీఎస్‌బీసీఎల్ (APSBCL) నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము జమ చేసేవారు. ఆ తరువాత 12 శాతాన్ని నగదు రూపంలోకి మార్చేసి దానిలో 12 శాతాన్ని వైసీపీకి ముఖ్యంగా చెప్పాలంటే ఆ పార్టీ అధినేతకు అందజేసేవారని సమాచారం. దీనికోసం సడెన్‌గా కొన్ని భారీ కంపెనీలు ఏపీలో వెలిశాయి. కొన్ని డొల్ల కంపెనీలు, బంగారు కంపెనీలు తదితర వందలాది కంపెనీలను గట్టిగానే వాడేశారని టాక్. ఆయా ఖాతాల్లోకి నిధులు మళ్లించి వైట్ నుంచి బ్లాక్‌లోకి మార్చేవారట. అలా భారీగా మనీ లాండరింగ్ వంటివి జరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ సోదాలు నిర్వహించిందని టాక్. ఏది ఏమైనా వైసీపీకి ఏపీలో రానున్న తరుణంలో మరింత గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కోబోతున్నాయి.
ప్రజావాణి చీదిరాల