Politics

KCR: కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? ఆయన సతీమణి ఎక్కడ?

అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇంటి పూజకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన వారు షాక్ అయ్యారు.

KCR: కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? ఆయన సతీమణి ఎక్కడ?

అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? కవిత (Kalvakuntla Kavitha)ను రాజకీయాల నుంచే కాదు.. కుటుంబం నుంచి కూడా బహిష్కరించారనే టాక్ ఒకవైపు నడుస్తోంది. మరోవైపు ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. అదేంటంటే దసరా పండుగ (Dussehra Festival) సందర్భంగా కేసీఆర్ ఇంట్లో నిర్వహించిన పూజలో ఆయన కూతురే కాదు.. భార్య కూడా లేరు. ఆమె ఎందుకు లేరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇంట పూజకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ (KCR Wife Shobha) ఎందుకు హాజరు కాలేదనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోనీ ఈ పూజా కార్యక్రమం ఎక్కడో జరిగిందిలే.. అందుకే హాజరు కాలేదనుకుంటే.. అంతా లైట్ తీసుకునేవారేమో.. కానీ పూజ జరిగింది కేసీఆర్ నివాసం (KCR Home)లోనే కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ పూజకు కేటీఆర్ (KTR), ఆయన సతీమణి, పిల్లలు హాజరయ్యారు. కేసీఆర్ మాత్రం ఒంటరిగానే పూజ నిర్వహించారు. భార్యాభర్తలిరువురూ కలిసి నిర్వహించాల్సిన పూజలో కేసీఆర్ సతీమణి శోభ కనిపించకపోవడంపై రకరకాల చర్చ జరుగుతోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా కూడా కల్వకుంట్ల కుటుంబమైతే ఈ విషయంపై కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.

కొందరు శోభ అనారోగ్య కారణాలతో హాజరుకాకపోయి ఉండొచ్చని అంటుంటే.. శోభ తన కూతురు పక్షమని.. అంటున్నారు. కూతురుని పార్టీ నంచి పంపించడం శోభకు ఇష్టం లేదని ఆ కారణంగానే ఆమె పండుగ సందర్భంగా తన కూతురికి సపోర్ట్‌గా వెళ్లి ఉంటారని టాక్. పైగా కూతురు (Kavitha)ని కుటుంబం నుంచి సైతం బహిష్కరించడం అనేది ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదని.. అసలు దానిని జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి తండ్రి కూతురు పక్షం వహిస్తాడని.. తల్లి కొడుకు పక్షం వహిస్తుందని చెబుతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సీన్ రివర్స్ అని అంటున్నారు. ఏపీ (Andhra Pradesh)లో వచ్చేసి షర్మిల (YS Sharmila)కు విజయమ్మ (YS Vijayamma) తోడుగా నిలిస్తే.. తెలంగాణకు కవితకు శోభ అండగా నిలుస్తున్నారని అంటున్నారు.

కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా ఉండేవారు పాజిటివ్‌గా మాట్లాడుతుంటే.. వ్యతిరేకవర్గం మాత్రం కవితతో ముడి పెట్టి విమర్శిస్తున్నారు. ఇంట్లో పనుల కారణంగా ఆమె పూజకు హాజరు కాలేకపోయి ఉండవచ్చంటుంటే.. ఇంట్లో పనులకు అడుగుకో పని మనుషులుంటారని.. అయినా పూజ సమయం ముందుగానే అనుకుంటారు కాబట్టి ఆ సమయానికి పూజ ముగించుకుని వచ్చి ఉండవచ్చు కదా.. ఒకవేళ అది అయి ఉంటేనని కొందరు అంటున్నారు. అసలు ఇప్పటి వరకూ పూజలో శోభ గైర్హాజరవడమనేదే లేదని మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో ఏదో గట్టి వివాదమే నడుస్తోందని.. అందుకే శోభ తండ్రీకొడుకులను బహిష్కరించి ఉండవచ్చని అంటున్నారు. పైగా కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంత చర్చ జరుగుతున్నా స్పందించకపోవడం చర్చకు బలాన్ని చేకూరుస్తోంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 3, 2025 9:16 AM