Politics

Nara Brahmini: బ్రహ్మినికి ఏమైంది.. సమ్‌థింగ్ ఫిషీ అంటూ పోస్ట్.. నెట్టింట పెద్ద రచ్చ

ప్రపంచం ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న విషయం దొరికిందా? దానిని చిలువలు పలవలు చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. సోషల్ మీడియా ఫాస్ట్ అయిన తర్వాత మంచి, చెడు ఏకతాటిపై నడుస్తున్నాయి.

Nara Brahmini: బ్రహ్మినికి ఏమైంది.. సమ్‌థింగ్ ఫిషీ అంటూ పోస్ట్.. నెట్టింట పెద్ద రచ్చ

ప్రపంచం ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న విషయం దొరికిందా? దానిని చిలువలు పలవలు చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. సోషల్ మీడియా ఫాస్ట్ అయిన తర్వాత మంచి, చెడు ఏకతాటిపై నడుస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే మంచి కంటే చెడు ఒకడుగు ముందే ఉంటోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కోడలు.. మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మిణి గురించి అదే రచ్చ నెట్టింట ప్రారంభమైంది.

ఉగాది వేడుకైనా.. తిరుమల అయినా..

‘నారా బ్రాహ్మినికి ఏమైంది? మొన్న ఉగాది ఫోటోలో లేరు.. నిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా తిరుమల కూడా వెళ్ళలేదు?’ అని ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. అది చూసిన వారంతా రెండు వర్గాలుగా విడిపోయి మరీ కొట్టుకుంటున్నారు. వాస్తవానికి కూడా ఉగాది వేడుక అయినా.. తిరుమల అయినా ఆడవారికి ఎలాంటి ఇబ్బంది లేకుంటేనే వెళ్లడానికి సాధ్యమవుతుంది. స్త్రీలకు పిరియడ్స్ వంటివి ఉంటే ఉగాది వేడుక అయినా.. తిరుమల అయినా దూరంగానే ఉంటారు. ఇది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో తల్లినో.. చెల్లినో చూసినా అర్థమవుతుంది. అంత మాత్రం దానికి నెట్టింట పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదానిని పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.

సమ్‌థింగ్ ఫిషీ..

కొడుకు పుట్టినరోజు నాడు తనతో గడపాలని ఏ తల్లికి ఉండదు? అలాగే ఆ కొడుకుతో దైవకార్యం చేయించాలని తాత, తండ్రి భావిస్తే ఎవరైనా అడ్డు చెప్పగలరా? ఇదొక చిన్న విషయం. దీనిని తీసుకెళ్లి ప్రపంచంలో ఎవరికీ రాని సందేహమేదో తనకే వచ్చినట్టుగా పోస్ట్ పెట్టి.. దానికి ‘సమ్‌థింగ్ ఫిషీ’ అంటూ ఓ ట్యాగ్‌లైన్ ఇవ్వడం ఎంతవరకూ సమంజసం? దీనిపై నెటిజన్లంతా రెండు వర్గాలుగా విడిపోయారు. లేడీస్‌కి సమస్యలుంటాయని తెలవవా? అని కొందరు.. మా భారతీ రెడ్డి (మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సతీమణి)ని అన్నప్పుడు ఇవన్నీ గుర్తు లేవా? అని కొందరు ఒకరకంగా నెట్టింట ఫైట్ చేసుకుంటున్నారు.

ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేయలేదు?

ఉగాది వేడుకలో ‘మీ భారతీ రెడ్డి గారు ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేయలేదు?’ అని మేము కూడా ప్రశ్నించగమని టీడీపీ ఫాలోవర్స్ అంటున్నారు. ఇక వైసీపీ వాళ్లైతే.. నారా లోకేష్, బ్రాహ్మణిలకు గ్యాప్ వచ్చిందని.. డివోర్స్ తీసుకుంటున్నారని కూడా రచ్చ చేస్తున్నారు. చిన్న విషయాన్ని ఎంత పెద్ద రచ్చ చేయవచ్చో.. సోషల్ మీడియాను చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది. అసలు టీడీపీ కావొచ్చు.. వైసీపీ కావొచ్చు.. స్త్రీలపై రచ్చేంటి? మరీ దారుణం. పైగా బ్రాహ్మిణి ఎక్కడైనా చాలా డీసెంట్‌గా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తి గురించి ఇంత నీచమైన రచ్చ అవసరమా? ఒకసారి స్త్రీ గురించి పోస్ట్ పెట్టేటప్పుడు.. అది ఏ పార్టీకి చెందిన వారైనా కావొచ్చు. జాగ్రత్తగా ఆలోచించి పెడితే బాగుంటుంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 22, 2026 4:50 AM