Politics

Jogi Ramesh: భార్యాబిడ్డలుంటే ఏం చేస్తారు? ఈ హెచ్చరికలేంటి?

కిండపడ్డా పై చేయి మాదే అనే వ్యక్తులు కొందరుంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం చెప్పుకోవాల్సి వస్తే మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) గురించి చెప్పుకోవాలి. ఆయన్నేమి పోలీసులు ఏ స్వాతంత్ర్య పోరాటంలోనో అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లలేదు.

Jogi Ramesh: భార్యాబిడ్డలుంటే ఏం చేస్తారు? ఈ హెచ్చరికలేంటి?

కిండపడ్డా పై చేయి మాదే అనే వ్యక్తులు కొందరుంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం చెప్పుకోవాల్సి వస్తే మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) గురించి చెప్పుకోవాలి. ఆయన్నేమి పోలీసులు ఏ స్వాతంత్ర్య పోరాటంలోనో అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లలేదు. నకిలీ మద్యం తయారీ కేసులో అడ్డంగా దొరికిపోయారు. నకలీ మద్యం దందాకు అండదండలు సహకారాలు అందించి సాక్ష్యాలతో సహా దొరికిపోయిన తర్వాత కూల్‌గా వ్యవహరిస్తే బాగుండేది. లేదంటే తాను నిర్దోషినని నిరూపించుకున్న మీదట మాటలు జారినా బాగుంటుంది కానీ అనవసరంగా మాటలు జారడం.. అందునా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం దిగజారడమే అవుతుంది.

నకిలీ మద్యం దందాకు అండదండలు..

వైసీపీ (YCP) హయాంలో నకిలీ మద్యం దందా నిర్విఘ్నంగా కొనసాగిందన్న ఆరోపణలున్నాయి. నకిలీ మద్యం (liquor racket) దందాకు అప్పట్లో మంత్రిగా ఉన్న జోగి రమేష్‌కు అండదండలు, సహాయ సహకారాలు అందించారని ఆధారాలతో సహా నిరూపణ అయ్యింది. జోగి రమేష్‌ ఆదేశాల మేరకు వైసీపీ హయాంలో 2022 జూన్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్‌రావు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.8 లక్షలు విత్‌డ్రా చేసి.. అందులో రూ.4 లక్షలు, మరో సందర్భంలో రూ.9 లక్షలు విత్‌డ్రా చేసి అందులో రూ.5 లక్షలను ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్‌ వద్ద జోగి రమేష్ సోదరుడు జోగి రాము (Jogi Ramu)కు ముట్టజెప్పినట్లు పోలీసులు గుర్తించారు. రమేష్‌కు జనార్దన్‌రావు డబ్బులివ్వడం తాము చూశామని పలువురు సాక్షులు వెల్లడించినట్లు సైతం తెలుస్తోంది.

జోగి రమేష్ హైడ్రామా..

నకిలీ మద్యం దందా వ్యవహారంలో జోగి రమేష్ భార్యాబిడ్డల జోలికి పోలీసులేమీ వెళ్లలేదు. అయినా నిన్న ఆయన చేసిన హెచ్చరికలు.. దారుణమనే చెప్పాలి. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఇంటి నుంచి జోగి రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అక్కడి నుంచి తమ వాహనంలో విజయవాడలోని తూర్పు ఎక్సైజ్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ చేసిన హైడ్రామా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. జోగి రమేష్ తన అరెస్ట్ సమయంలో సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో ఊగిపోయారు. తనను అరెస్ట్ చేసినందుకు ఆగ్రహం ఉండొచ్చు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. చంద్రబాబు (CM Chandrababu), నారా లోకేష్ (Nara Lokesh) అంతు చూస్తానన్నారు. అంతా సత్తా ఉంటే చూసుకోవచ్చు కానీ.. ‘చంద్రబాబు నీకూ కుటుంబముంది. భార్యాబిడ్డలు ఉన్నారు’ అంటూ హెచ్చరికలు ఎందుకు? కుటుంబముంటే ఏం చేస్తారు?

పొలిటికల్ కెరీరే నాశనం..

అసలెందుకు వైసీపీ నేతల (YCP Leaders)కు ఏం జరిగినా భార్యాబిడ్డలు ఎందుకు గుర్తొస్తారో అర్థం కాదు. చేసిందేదో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పని అన్నట్టుగా.. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. ఇవ్వాలి తప్పదు.. పరిస్థితి అలాంటిది కానీ ఇలా భార్యాబిడ్డల ప్రస్తావన తీసుకొచ్చి మరింత జనాల్లో చులకన అవకూడదు. గతంలో అసెంబ్లీలో ఒకరిద్దరు ఇలాగే భార్యాబిడ్డల గురించి అసహ్యంగా మాట్లాడి పొలిటికల్ కెరీర్‌నే నాశనం చేసుకున్నారు. ఇప్పుడు జోగి రమేష్ కూడా అలాంటి బాటలోనే ఉన్నారు. ఈయనే కాదు.. ఈయన అనుచరులు సైతం అలాగే ఉన్నారు. ఏమాత్రం జోగికి తీసిపోకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ 2.0 (Jagan 2.0) అనేది త్వరలోనే చూపిస్తామని.. ఒక్కొక్కడి బట్టలూ ఊడదీస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 3, 2025 4:47 AM