Railway Reservation: రైల్వే రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
రైల్వే రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇక మీదట అది అందరికీ సాధ్యం కాదు.. ఈ క్రమంలోనే రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

రైల్వే రిజర్వేషన్ (Railway Reservation) చేసుకోవాలనుకుంటున్నారా? ఇక మీదట అది అందరికీ సాధ్యం కాదు.. ఈ క్రమంలోనే రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకు సైతం ఆధార్ అథెంటికేషన్ (Aadhaar Authentication)ను రైల్వే బోర్డు తప్పనిసరి చేసింది. టికెట్లు రిజనర్వేషన్ చేసుకునేందుకు తొలి 15 నిమిషాలు ఆథార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రం వీటుంటుంది. వారు మాత్రమే ఐఆర్‌సీటీసీ (IRCTC) లేదంటే అధికారిక యాప్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకూ తత్కాల్ బుకింగ్ (Tatkal booking) విధానంలో మాత్రమే అమల్లో ఉన్న ఈ పద్ధతి ఇక మీదట అంటే అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తింపజేయనున్నారు.
రైల్వే బోర్డు సాధారణ రిజర్వేషన్లకు సైతం ఆధార్ వెరిఫికేషన్ (Aadhaar Verification) తప్పనిసరి చేయడానికి కారణముంది. ప్రస్తుతం ఏదైనా ట్రైన్‌కు మనం ముందుగానే షెడ్యూల్ చేసుకుని ఉంటే.. 60 రోజుల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు సౌలభ్యం ఉంది. అయితే బుకింగ్ ప్రారంభమైన వెంటనే అక్రమార్కులు తత్కాల్ టికెట్ల (Tatkal booking) మాదిరిగానే సాఫ్ట్‌వేర్ (Software) సాయంతో టికెట్లను బుక్ చేయడం జరుగుతోంది. ఇలా చేయడం వలన సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో రిజర్వేషన్ టికెట్లు (Reservation Tickets) పక్కదోవ పట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డు (Railway Board) అన్ని జోనల్ కార్యాలయాల (Zonal offices)కు సమాచారం ఇచ్చింది. ఈ నిర్ణయం కారణంగా రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ (Railway Reservation Counter)లో టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పూ ఉండదని రైల్వే అధికారులు (Railway officials) వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల