Politics

Trisha: విజయ్‌ని దెబ్బతీసేందుకు అస్త్రంగా త్రిష.. తమిళనాట నీచ రాజకీయం

తమిళ రాజకీయంలో కొత్త సంస్కృతిని నేతలు పరిచయం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. వాస్తవానికి నాయికా ఆరాధన అనేది తమిళనాట ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

Trisha: విజయ్‌ని దెబ్బతీసేందుకు అస్త్రంగా త్రిష.. తమిళనాట నీచ రాజకీయం

తమిళ రాజకీయంలో కొత్త సంస్కృతిని నేతలు పరిచయం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. వాస్తవానికి నాయికా ఆరాధన అనేది తమిళనాట ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తమిళ నేతలు స్టార్ హీరోయిన్ త్రిషను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి సైతం వెనుకాడటం లేదు. ఎందుకింతలా నేతలు దిగజారుతున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది.

కీలక నేత త్రిషను తీసుకొచ్చారంటూ..

స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీని స్థాపించి తమిళనాడులోని రాజకీయ నేతలకు కంటకంగా మారారు. సినీ గ్లామర్‌కు ప్రజలు పెద్ద పీట వేస్తారు. అలాంటి చోట విజయ్‌ను దెబ్బకొట్టాలంటే.. అది నేరుగా అవదని భావించిన నేతలు త్రిషను అడ్డుపెట్టుకుంటున్నారనడంలో సందేహం లేదు. గతంలో సేలం వెస్ట్ మాజీ ఎమ్మెల్యే త్రిష పట్ల దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కూవత్తూరు రిసార్ట్ రాజకీయాల సమయంలో ఓ కీలక నేత త్రిషను తీసుకొచ్చారంటూ అత్యంత నీచమైన ఆరోపణలు చేశారు. ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు ఒక నటి పట్ల చేయడం అనేది క్షమించరానిది.

త్రిషపై నిరాధార ఆరోపణలు..

ఇక ఇప్పుడు కూడా మరోసారి త్రిష విషయంలో తమిళనాడు రాజకీయ నేతలు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేయడమనేది ఆది నుంచి అక్కడి రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. టీవీకే పార్టీని మాత్రమే కాకుండా దాని అధినేత విజయ్‌ను ఇబ్బంది పెట్టేందుకు త్రిషను టార్గెట్‌గా అక్కడి రాజకీయ నేతలు ఎంచుకుంటున్నారు. త్రిషతో విజయ్‌కు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. చివరకు మీరా మిథున్ వంటి నటులు సైతం త్రిషను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేయడం దారుణం. త్రిష తన అవకాశాలను లాగేసుకుంటోందని ఆమె ప్రధాన ఆరోపణ. అలాగే నటుడు మన్సూర్ అలీఖాన్ సైతం చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచం. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని.. కానీ అది జరగలేదని మన్సూర్ అలీఖాన్ చెప్పడం అతని నీచ మనస్తత్వానికి నిదర్శనం.

వెన్నుచూపని త్రిష..

తమిళ రాజకీయాలకు.. సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. ఒకప్పుడు ఎంజీఆర్ కావొచ్చు.. జయలలిత కావొచ్చు.. సినీరంగం నుంచి వచ్చిన వారే. తమిళ సీఎంలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ప్రస్తుతం విజయ్‌కు వస్తున్న మద్దతు చూస్తుంటే అక్కడి నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. ఈ క్రమంలోనే విజయ్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు త్రిషను ఆయుధంగా వాడుతున్నారు. త్రిష కూడా ఏమీ వెన్ను చూపడం లేదు. ధైర్యంగా నిలబడి పోరాడుతోంది. ఆమెకు సినీ రంగం నుంచి కూడా గట్టిగా మద్దతు లభిస్తే బాగుంటుందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 16, 2026 7:45 AM