Politics

AP Elections: ఏపీలో ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే.. మ్యాటర్ క్లియర్..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? తెలంగాణలో అయితే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మునిసిపల్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఆంధ్ర మాటేంటి? ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి? ఎప్పుడు మునిసిపల్ ఎన్నికలు?

AP Elections: ఏపీలో ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే.. మ్యాటర్ క్లియర్..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? తెలంగాణలో అయితే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మునిసిపల్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఆంధ్ర మాటేంటి? ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి? ఎప్పుడు మునిసిపల్ ఎన్నికలు? అసలు ఆ ఆలోచన ఏపీ పాలకులకు ఉందా.. లేదా? ఒకవేళ ఉంటే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు? వంటి విషయాలపై తాజాగా క్లారిటీ అయితే వచ్చింది. తెలంగాణలో లోకల్‌ బాడీ ఎన్నికల గడువు ముగియనుంది. కానీ ఏపీలో పరిస్థితి వేరు. ఇంకా మునిసిపల్ కార్పొరేషన్లకు గడువు ఉంది. దీంతో పాటు జిల్లా పరిషత్‌లకి సైతం జూన్ వరకూ సమయం ఉండటంతో ఎన్నికలపై ఒక కీలక అప్‌డేట్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది.

కొత్త డేటా ప్రకారమే ఎన్నికలు..

ఏపీలో మునిసిపల్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టనుంది. అదే జనగణన. ముందుగా జనగణన కార్యక్రమాన్ని నిర్వహించిన మీదటే మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ సైతం క్లారిటీ ఇచ్చారు ఈ క్రమంలోనే ఈ ఏడాదే జనగణన నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. అయితే జగగణన పూర్తి కావడానికి ఈ ఏడాదంతా పట్టే అవకాశం ఉంది. దాదాపుగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా పూర్తైన తర్వాత కొత్త డేటా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల 2027లో లోకల్ బాడీస్‌కి ఎన్నికలు జరుగుతాయని మంత్రి అంటున్నారు.

మార్చితో ముగియనున్న గడువు..

ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర జనాభా వివరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి అంటే 2011వి మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత అయితే 2021లో జనగణన జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అది కూడా జరగలేదు. దీంతో ఎన్నికలు వాయిదా పడతాయని అంటున్నారు. కొత్త జనాభా లెక్కలు వచ్చిన వెంటనే సామాజిక సమీకరణాలు కూడా చూసుకుని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రిజర్వేషన్ కూర్పు ఉంటుందని సమాచారం. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అంటే మొత్తానికి ఈ ఏడాది అయితే ఎన్నికలు ఉండే అవకాశమే లేదు. మునిసిపల్ ఎన్నికల గడువు మార్చితో తీరనుంది. అప్పటికి పాలక మండళ్లు సైతం రద్దు కానున్నాయి. ఆ తరువాత ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పాలన కొనసాగనుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 7, 2026 7:23 AM