Arava Sridhar: అజ్ఞాతంలోకి హర్షవీణ.. ఆమె గత చరిత్ర నీచాతి నీచం..
రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పదే పదే వినిపిస్తున్న హర్ణవీణ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నాయకుడు అరవ శ్రీధర్. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు వీరిద్దరూ. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లని అందరికీ తెలిసిందే.
రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పదే పదే వినిపిస్తున్న హర్ణవీణ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నాయకుడు అరవ శ్రీధర్. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు వీరిద్దరూ. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లని అందరికీ తెలిసిందే. అయితే ఒక చేయి రాజకీయ నాయకుడిదైతే మాత్రం ఆ చేతిదే తప్పు. కానీ అరవ శ్రీధర్‌కు కొంత మద్దతు అయితే లభిస్తోంది. దీనికి కారణం. వారిద్దరి విషయంలో ఒకరి తప్పే లేదని గ్రహించడం. మీడియా సమావేశంలోనూ సదరు మహిళను ఎందుకు ఇష్టం లేకుండా ఐలవ్యూ చెప్పావని అడిగితే వీణకు నోటి వెంట మాట రాలేదు. ఇదిలా ఉండగా ఆమె సడెన్‌గా గాయబ్ అయ్యింది.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలా దేవి తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తోందని హర్ష వీణపై ఫిర్యాదు చేశారు. అలాగే మరొక వ్యక్తిని నిర్బంధించి దాడి చేసిందని కూడా ఆమెపై కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు మహిళపై రెండు కేసులు నమోదయ్యాయి. ఏ క్షణమైనా పోలీసులు హర్షవీణను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు బయటకు రావడంతో గాయబ్ అయ్యింది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. డబ్బు కోసమో.. మరొక దాని కోసమో.. వివాహితలు ఇలాంటి దారుణాలకు పాల్పడటం నీచాతి నీచం.
హర్ష వీణ విషయానికి వస్తే ఆమె గత చరిత్ర కూడా అంత గొప్పగా ఏమీ లేదు. గతంలో అంటే 2018లో హర్షవీణ విశాఖపట్నంకు చెందిన సంసాని భవాని శంకర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ కాపీల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఆమె తన భర్త భవాని శంకర్ సహా అతని కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు పెట్టింది. ఫేస్‌బుక్ ద్వారా భవాని శంకర్ ఆమెకు పరిచయమైనట్టుగా పేర్కొంది. ఆ తరువాత తనను వివాహం చేసుకుని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ అప్పట్లో గృహ హింస చట్టం కిం కేసు పెట్టింది. ఈ కేసులో హర్షవీణ చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేనందున బద్వేల్ కోర్టు 2023 డిసెంబర్ 20న బద్వేల్ కోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఆ తరువాత ఆమె నాగమునిరెడ్డిని వివాహం చేసుకుంది.