Politics

Phone Tapping Case: కేసీఆర్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు వచ్చేసింది. నేడు ఆయనను నందినగర్‌లోని ఆయన నివాసంలో సిట్‌(Special Investigating Team) అధికారులు విచారణ చేస్తున్నారు.

Phone Tapping Case: కేసీఆర్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు వచ్చేసింది. నేడు ఆయనను నందినగర్‌లోని ఆయన నివాసంలో సిట్‌(Special Investigating Team) అధికారులు విచారణ చేస్తున్నారు. కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్థులోని ఓ గదిలో జరుగుతున్న ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్‌పై సిట్ పలు ప్రశ్నలు సంధిస్తోంది. సిట్ అధికారులు వెళ్లడమే.. పలు డాక్యుమెంట్లతో పాటు పరికరాలతో కేసీఆర్ నివాసంలోకి వెళ్లారు. పరిస్థితి చూస్తుంటే ఆయన నివాసానికి వెళ్లిన ఐదుగురు అధికారుల బృందం ఆయనను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సిట్ విచారణ నేపథ్యంలో నందినగర్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఇక ఇతరులెవరూ కేసీఆర్ నివాసంలోకి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిట్ అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కానీ.. కేసీఆర్ అనుచరులెవ్వరినీ ఆయన నివాసంలోకి రానివ్వడం లేదు. అలాగే కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. అయితే ముందుగానే అంటే కేసీఆర్ నందినగర్ నివాసానికి రాకమునుపే ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు నందీనగర్ నివాసానికి చేరకున్నారు. కేసీఆర్ విచారణ సమయంలో వారు అక్కడే ఉన్నారు. విచారణను అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 1, 2026 1:08 PM