PM Modi: ప్రభుత్వోద్యోగులకు ఎదురుగా కోడిని వేలాడదీసి ప్లేటులో ప్లెయిన్ రైస్ వడ్డిస్తున్న మోదీ
ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం (Central Government Employees)టే ఆహా అనేవారు.. ఇప్పుడు అమ్మో అంటున్నారు. మోదీ (PM Narendra Modi) ఎప్పుడైతే కేంద్రం పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి వారి పరిస్థితి దిగజారిందనే చెప్పాలి.
ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం (Central Government Employees)టే ఆహా అనేవారు.. ఇప్పుడు అమ్మో అంటున్నారు. మోదీ (PM Narendra Modi) ఎప్పుడైతే కేంద్రం పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి వారి పరిస్థితి దిగజారిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. నోరు మెదిపే సాహసం కూడా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎదురుగా కోడిని వేలాడదీసి ప్లేటులో ప్లెయిన్ రైస్ వడ్డించినా కిమ్మనకుండా తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హయాంలో కాలర్ ఎగరేసుకుని తిరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు యూనియన్ల నేతలు.. ఇప్పుడసలు ఏమయ్యారో కూడా తెలియదు. అసలు యూనియన్లు ఉన్నాయా? లేవా? అనేది కూడా తెలియదు.
70 ఏళ్లలో ఎన్నడూ ఇవ్వనంత దారుణమైన పేస్కేల్..
రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఐదేళ్లకోసారి పే స్కేల్‌ను రివిజన్ చేయడం జరుగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లకోసారి. అయినా సరే.. గతంలో అంటే మోదీ పగ్గాలు చేపట్టక పూర్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మోదీ వచ్చాక కనీసం ఒక సాధారణ టీచర్‌కు వస్తున్న జీతం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగికి రావడం లేదంటే అతిశయోక్తి కాదు. 2016లో మోదీ ప్రభుత్వం (Modi Government) 7వ పే కమిషన్ ఇచ్చింది. 70 ఏళ్లలో ఎన్నడూ ఇవ్వనంత దారుణమైన పేస్కేల్ అది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కానీ నోరు తెరిచేంత సీన్ లేదు. ఒకవేళ తెరిస్తే మోదీ ప్రభుత్వం తీసుకునే చర్యలను ఫేస్ చేయలేక ఎక్కడివారు అక్కడ గప్ చుప్.
డీఏ 1 శాతమా?
ఇక కరువు భత్యం (DA) విషయంలో కూడా మోదీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. కేంద్రం ఇష్టానుసారంగా పన్నులు బాదేసింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటే మోదీ ప్రభుత్వ మహిమే అనడంలో సందేహం లేదు. మరి అంతలా ధరలు పెంచేసిన కేంద్రం.. తమ ఉద్యోగులకు మాత్రం డీఏ ఇవ్వడానికి కూడా మనసు ఒప్పలేదు. కాంగ్రెస్ హయాంలో డీఏ అంటే మినిమం 6 శాతం ఉండేది. దాదాపుగా 8 - 10 శాతాలకు తగ్గిన దాఖలాలైతే చాలా తక్కువని చెప్పాలి. కానీ మోదీ ప్రభుత్వం 1 పర్సంట్ ఇవ్వడం గమనార్హం. ఒక్కసారి 4 శాతం డీఏ ప్రకటిస్తే.. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఎప్పటికీ చూడలేమనుకున్న అద్భుతాన్ని చూసినట్టుగా సంబరపడిపోయారు.
భూతద్దంలో చూపిస్తున్న మీడియా..
ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్న కేంద్రానికి కనీసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. ఒకసారి అయితే డీఏను స్కిప్ చేయడం కూడా గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వం డీఏ 1 శాతం లేదంటే 2 శాతం పెంచినప్పుడల్లా మీడియా (Media) దానిని భూతద్దంలో చూపిస్తే నోట్ల కట్టలతో ఉన్న ఫోటోను పెట్టి.. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టడం గమనార్హం. అది చూసిన కేంద్ర ప్రభుత్వోద్యోగులు నవ్వాలో ఏడవాలో తెలియక కామ్ అయిపోతున్నారు. ఇక 2026 జనవరి నుంచి 8వ పే కమిషన్‌ను ప్రకటించాల్సి ఉంది. ఎప్పటి నుంచో ఊరిస్తూ తాజాగా విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనప్రకాశ్ దేశాయ్ (Former Supreme Court judge Ranjana Prakash Desai) నేతృత్వంలో కమిషన్ వేసింది.
వీఆర్ఎస్ తీసుకుంటున్న వారి సంఖ్యా ఎక్కువే..
ఈ కమిషన్ 18 నెలల తర్వాత తన నివేదికను సమర్పించనుందని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కమిషన్ ఎప్పుడు నివేదికను ఇవ్వాలి? ఎప్పుడు కేంద్రం 8వ పే కమిషన్‌ను ప్రకటించాలి. మరో రెండేళ్లు పడుతుందనడంలో సందేహమే లేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజాలా బతికిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంటుల్లా మారారనడంలో సందేహమే లేదు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఎస్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగింది. మొత్తానికి ఎలా చూసుకున్నా కూడా పాపం కేంద్ర ప్రభుత్వోద్యోగులు అని అనక తప్పని పరిస్థితి. మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై మోదీ దయ తలుస్తారో లేదో చూడాలి.