Politics

Bandi Sanjay: రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్.. గాంధీభవన్‌లోనే ఎమ్మెల్యేల సంసారం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆ మధ్యకాలంలో కాస్త తగ్గారనుకుంటే తిరిగి నోటికి పని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ వ్యభిచారి అని ఆయన తేల్చేశారు. ఫిరాయింపుల విషయంలో ఆ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందట.

Bandi Sanjay: రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్.. గాంధీభవన్‌లోనే ఎమ్మెల్యేల సంసారం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆ మధ్యకాలంలో కాస్త తగ్గారనుకుంటే తిరిగి నోటికి పని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ వ్యభిచారి అని ఆయన తేల్చేశారు. ఫిరాయింపుల విషయంలో ఆ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందట. అంతేకాదు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్‌లోనే సంసారం చేస్తున్నారని అన్నారు.

శాసనసభ స్పీకర్ ఆయా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాల్లేవని చెప్పడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. స్పీకర్‌పై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తోందన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్‌లు పెడుతున్నారని.. వాళ్ల చేతికే బీఫామ్‌లు సైతం వెళుతున్నాయన్నారు. కళ్ల ముందే అన్ని విషయాలు కనిపిస్తున్నా స్పీకర్ ఫిరాయింపులపై అలా మాట్లాడటం దారుణమన్నారు. స్పీకర్ ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని బండి సంజయ్ కోరారు.

ఓటుకు రూ.10 వేలు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీ‌గ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ఏకిపారేశారు. తమకు భయపడే కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డా పెట్టాడని విమర్శించారు. ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నాడని.. అవి మనవే కాబట్టి తీసుకుని పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ కోరారు. మొన్నటిదాకా సిరిసిల్ల మునిసిపల్ పీఠాన్ని బీఆర్ఎస్‌కు అప్పగిస్తే ఒక్క వానకే గల్లీలన్నీ మునిగిపోతున్నాయన్నారు. ఆఖరికి జిల్లా కలెక్టరేట్ సైతం మునిగిపోయిందన్నారు. మొత్తానికి బండి సంజయ్ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను గట్టిగానే తోముతున్నారు.

ప్రయత్నం ఫలిస్తుందా?

మొత్తానికి మునిసిపల్ ఎన్నికల కోసం బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులిద్దరూ రంగంలోకి దిగారు. ఇద్దరూ గట్టిగానే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి పెద్దగా బీజేపీ ప్రభావం చూపించడం లేదు. ఉప ఎన్నికలు రెండొచ్చినా కూడా వాటిలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇక మునిసిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా? ఎన్ని మునిసిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటుందనే విషయానికి కాలమే సమాధానం చెప్పాలి. పైగా కేంద్రం వెలువరించిన బడ్జెట్‌లో దీర్ఘకాలిక ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం ఒరిగిందేమీ లేదు. 2040లో ఎవరుంటారో.. ఎవరు పోతారో.. అసలు అప్పటికి బీజేపీ ప్రభుత్వం ఉంటుందో లేదో.. అలాంటిది.. 2040లో ఏదో చేస్తారంటే ఎలా నమ్మడమని ప్రజలు అనుకుంటున్నారు. అలా అనుకోవడంలోనూ తప్పులేదు. మరి ఇప్పుడు నమ్మి బీజేపీకి జనాలు ఓటేస్తారా? చూడాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 4, 2026 9:25 AM