Politics

Telangana News: సోషల్ మీడియా పోస్టులపై తస్మాత్ జాగ్రత్త..

ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం పేరిట ఎవరిపైనైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలేదే లేదని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం, దుష్ప్రచారం, కులమతాల మధ్య వివాదాలు సృష్టించేలా పోస్టులు, కామెంట్లు పెట్టేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెబుతోంది.

Telangana News: సోషల్ మీడియా పోస్టులపై తస్మాత్ జాగ్రత్త..

మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యం. మంచి గడప దాటే లోపు చెడు ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందని చెబుతారు. సోషల్ మీడియా ఈ ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను భుజాన వేసుకుంది. మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రపంచానికి మోసేస్తుంది. ఇక ఈ పని చేస్తున్నది సోషల్ మీడియానే అయినా కూడా చేస్తున్నది మనుషులేగా. అలాంటి వారికి గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం పేరిట ఎవరిపైనైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలేదే లేదని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం, దుష్ప్రచారం, కులమతాల మధ్య వివాదాలు సృష్టించేలా పోస్టులు, కామెంట్లు పెట్టేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెబుతోంది. అలాంటి వారికి ఏడేళ్ల జైలు శిక్ష వేసేలా కొత్త చట్టం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

ఏడేళ్ల జైలు..

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా దారుణమైన ప్రచారానికి ఒడిగడుతోంది. ముఖ్యంగా ఫేక్ ఐడీలతో కొందరు.. రాజకీయ పార్టీల అండ ఉందనో కొందరు ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వారందరికీ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు, వ్యక్తిత్వ హననానికి ఒడిగట్టే వారికి తస్మాత్ జాగ్రత్త. ఇకపై వారికి కఠినచర్యలు తప్పవని.. ఏడేళ్ల జైలు శిక్ష ఖాయమని.. ఈ మేరకు కొత్త చట్టం తీసుకురానున్నట్టు పొన్నం వెల్లడించారు. పొన్నం ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది మతపరమైన హెచ్చరికలు జారీ చేసే వారికా.. లేదంటే ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం ఎక్కువవుతోంది. పైగా సీఎం రేవంత్‌రెడ్డిని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి చట్టం తీసుకురావాలనుకుంటున్నారా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

సీఎం ప్రతిష్టకు భంగం కలిగించేలా..

ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున కొందరు వ్యక్తులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్టకే కాకుండా.. సీఎం రేవంత్ సహా మంత్రుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవలి కాలంలో దేశ రాజకీయాలను సోషల్ మీడియానే డిసైడ్ చేస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేస్తోంది. రాజకీయ నాయకులు ఏం మాట్లాడటానికి లేకుండా పోయింది. కొన్ని మాటలను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వలన కూడా రాంగ్‌గా నాయకులు మాట్లాడిన మాటలు ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధమవుతోంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 31, 2026 4:30 AM