Jubleehills Bypoll: వర్కవుట్ కాని సింపతీ.. కాంగ్రెస్ ఘన విజయం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం సాధించింది. ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే సింపతి ఏమాత్రం వర్కవుట్ కాలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఘన విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం సాధించింది. ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే సింపతి ఏమాత్రం వర్కవుట్ కాలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) జూబ్లీహిల్స్ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి కూడా నవీన్ యాదవ్ ముందంజలోనే ఉన్నాడు. రెండో రౌండ్ వచ్చేసరికి నవీన్ యాదవ్ ఆధిక్యం మరింత పెరిగింది. ప్రతి రౌండ్‌లోనూ నవీన్ యాదవే ముందంజలో ఉండటం ఆసక్తికరం. దీంతో తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha)పై 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ (EC) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ (BRS) ఆయన సతీమణి మాగంటి సునీత (Maganti Sunitha)నే రంగంలోకి దింపింది. దీంతో సింపతీ వర్కవుట్ అవుతుందని అంతా భావించారు. కానీ అది ఏమాత్రం వర్కవుట్ అవలేదని ఇవాళ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ కాంపిటేషన్ ఉండనున్నట్టుగా వెల్లడించాయి. కానీ ఫలితాలు చూస్తే మాత్రం టఫ్ ఏమీ లేదని.. వార్ వన్‌సైడ్ అయిపోయిందని ఫలితం చెబుతోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా రంగంలోకి దిగడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ తరుఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) రంగంలోకి దిగినా కూడా ఫలితం అనుకూలంగా రాలేదు. ఇక బీజేపీ ప్రభావమైతే ఏమాత్రం లేనట్టుగా తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల