YS Sharmila: వామ్మో.. అన్నకు హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేసిందిగా..
‘శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు’ అనేది ఓ సినిమా డైలాగ్. అన్ని వేళలా ఇది నిజం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్షరాలా నిజమే అనిపిస్తూ ఉంటుంది.

‘శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు’ అనేది ఓ సినిమా డైలాగ్. అన్ని వేళలా ఇది నిజం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్షరాలా నిజమే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో వైఎస్‌ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిలా రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. అదే వేరొకరితో ఏదో ఒకరకంగా కౌంటర్లు ఇచ్చి పడేసేవారు. సొంత చెల్లి అయిపోయింది. కౌంటర్ ఇస్తే ఎన్‌కౌంటరే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. జనాలను చూసి ఏమీ అనలేక వెనక్కు తగ్గుతున్నారు.
అధికారపక్షమైనా ఏమోలే అని వైసీపీ అధినేత జగన్ (YS Jaganmohan Reddy)ను వదిలేస్తుందేమో కానీ ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) మాత్రం అవకాశం దొరికితే చాలు ఏకి పారేస్తున్నారు. తాజాగా ఆమె తన అన్నకు హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేశారు. అసలే తనయుడి చేత రాజకీయ రంగ ప్రవేశం (Political Entry) చేయిస్తున్న జోష్‌లో ఉన్నారామె.. ఇటు జగనేమో తన తన తాత వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy) పేరుతో అతను ఎంట్రీ ఇవ్వడాన్ని అస్సలు హర్షించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వర్గీయులంతా వైఎస్ రాజారెడ్డి ఏంటంటూ షర్మిలపై మండిపడుతున్నారు. ఆమె తన తనయుడికి వైఎస్ ఇంటిపేరును ఎలా ఇస్తారు? అనేది ఒక ప్రశ్నైతే.. అసలు వైఎస్‌ఆర్‌కు రాజారెడ్డి ఎలా వారసుడవుతాడనేది మరో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలతో షర్మిలను కార్నర్ చేసేందుకు వైసీపీ నేతలు (YCP Leaders) నానా తంటాలు పడుతున్నారు. మరి షర్మిల ఊరుకుంటారా?
అసలైన వారసుడెవరో తేల్చేసిన షర్మిల..
తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ సహనానికి పరీక్ష పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy) వారసుడిగా జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తన పార్టీకి కూడా వైఎస్ పేరును పెట్టి మరీ నడిపిస్తున్నారు. జగన్ సందర్భం వస్తే చాలు.. తన తండ్రి పేరును వాడకుండా ఉండరు. అధికారంలో ఉన్న సమయంలోనూ తన తండ్రి పేరిట ఎన్నో పథకాలను జగన్ అమలు చేశారు. అలాంటి జగన్ ఉండగా.. తన కుమారుడే వైఎస్సార్‌కు అసలు సిసలైన వారసుడని షర్మిల తేల్చేశారు. తన తండ్రే తన కుమారుడికి రాజారెడ్డి అని పేరు పెట్టారని తెలిపారు. అది తన తాత పేరని వెల్లడించారు. వాస్తవానికి రాజారెడ్డి అనేది షర్మిల తాత పేరని అందరికీ తెలిసిందే. ఇక్కడి వరకూ చెప్పి ఊరుకుంటే పెద్దగా ఫరక్ పడేది కాదు కానీ వైఎస్సార్‌కు వారసులంటూ ఎవరైనా ఉన్నారంటే అది తన కుమారుడు రాజారెడ్డి మాత్రమేనని తేల్చేశారు.
సైతాన్ సైన్యం.. సైతాన్ పార్టీ..
ఇంతటితో ఆగితే బాగానే ఉంటుంది. వైసీపీ చేస్తున్న ప్రచారంపై కూడా స్పందించి మరీ ఏకిపారేశారు. పైగా షర్మిల కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఉన్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై కూడా ఆమె స్పందించారు. ఆ మాటలు చూస్తుంటే తనకు నవ్వొస్తోందంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి షర్మిల మీడియా ముందుకు వస్తున్నారంటేనే జగన్ (Jagan)కు వెన్నులో వణుకు పుడుతోందంటూ టీడీపీ (TDP), కాంగ్రెస్ (congress) కార్యకర్తలు అంటున్నారు. వైసీపీ (YCP)దొక సైతాన్ సైన్యమని.. ఆ పార్టీ ఒక సైతాన్ పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల అయితే ఏం చేసినా ఫుల్ క్లారిటీతోనే చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ప్రజావాణి చీదిరాల