YS Jagan: జగన్ ఓడిపోయారు కాబట్టి సరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు..
భార్య కోసం మహల్స్ నిర్మించిన వారు చరిత్రలో అతి తక్కువ మంది ఉన్నారు. షాజహాన్ సైతం ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్ కట్టాడు. ఇప్పటికీ అదొక అద్భుతమే.

భార్య కోసం మహల్స్ నిర్మించిన వారు చరిత్రలో అతి తక్కువ మంది ఉన్నారు. షాజహాన్ (Shajahan) సైతం ముంతాజ్ (Muntaj Begam) ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్ (Tajmahal) కట్టాడు. ఇప్పటికీ అదొక అద్భుతమే. అది కట్టి శతాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక ఏపీలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సైతం తన భార్య కోసం రుషికొండపై ప్యాలెస్ (Rushikonda Palace) నిర్మించారు. కానీ ఏడాది తిరగకముందే ప్యాలెస్‌కు బొక్కలు పడి.. సీలింగ్ ఊడి కింద పడి.. వర్షం నీళ్లు సైతం లోపలికి వచ్చేశాయి. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ ప్యాలెస్ హాట్ టాపిక్. తిరిగి ఇప్పుడు మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కారణంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగేదో ఊహించలేం..
తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. రుషికొండ ప్యాలెస్‌ను సందర్భించిన విషయం తెలిసిందే. ఆ తరువాత తిరిగి రుషికొండ ప్యాలెస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరైతే మరీ వెటకారంగా స్పందిస్తున్నారు. అదేంటంటే.. వైసీపీ (YCP) అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అధికారం కోల్పోయారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరుగేదో ఊహించలేమని అంటున్నారు. అంటే జగన్ (Jagan) అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన తన సతీమణి భారతీరెడ్డి (Bharathi Reddy)తో కలిసి రుషికొండ ప్యాలెస్‌కు మారి ఉండేవారని.. అప్పుడు ప్యాలెస్ పెచ్చులు ఊడి పడితే భారతీరెడ్డి (Jagan Wife Bharathi Reddy) పరిస్థితేంటంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏం జరిగినా అంతా మన మంచికేనంటూ హితవు పలుకుతున్నారు. షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టినట్టుగా భార్య కోసం జగన్.. రుషికొండ ప్యాలెస్‌ను కట్టాడు కానీ ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదంటూ టీడీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు.
పోలవరం ఆయన చేతిలో పడి ఉంటే..
జగన్‌కు ఏ పని చేయటం చేతకాదని మరోసారి దీని ద్వారా రుజువైందంటూ సోషల్ మీడియా వేదికగా (Social Media) పోస్టులు పెడుతున్నారు. జగన్ కట్టే కట్టడాలన్నీ ఇలాగే ఉంటాయని పేర్కంటున్నారు. సతీమణికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కట్టిన ప్యాలెస్‌నే ఇలా బొక్కలతో జగన్ కట్టారంటే.. ఒకవేళ పోలవరం (Polavaram) ఆయన చేతిలో పడి ఉంటే ఎన్ని బొక్కలు పడి ఉండేదోనని టీటీడీ కార్యకర్తలు (TDP Cadre) సెటైర్లు వేస్తున్నారు. బాత్ రూమ్‌లు సహా అన్నింటినీ లగ్జరీగా కట్టిన జగన్.. ఏడాది లోపే పెచ్చులూడిపోయేలా నిర్మాణం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అది పైకి చూసేందుకే ప్యాలస్ అని.. నిర్మాణమంతా డొల్ల అని అంటున్నారు. మొత్తానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి కట్టిన రుషికొండ ప్యాలెస్ హాట్ టాపిక్‌గా మారింది. సీఎం చంద్రబాబు.. రుషికొండను పరిశీలించమన్నారని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరిశీలించారు.. మరి దాని వినియోగానికి పవన్ ఏం సూచనలు చేస్తారో చూడాలి. మరి దీనిని కూటమి ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.