Politics

Revanth Reddy: రేవంత్ మొదలు పెట్టేశారు.. టార్గెట్ కేటీఆర్..!

కేటీఆర్ (KTR) వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావించడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills bypoll) ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.

Revanth Reddy: రేవంత్ మొదలు పెట్టేశారు.. టార్గెట్ కేటీఆర్..!

ఒకే ఒక్క సభతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎన్టీఆర్ (NTR), ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)లను వాడేశారు. అది చాలదన్నట్టుగా కేటీఆర్ (KTR) వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావించడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills bypoll) ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రస్తావన తీసుకొచ్చి మరీ కేటీఆర్‌ను ఏకిపారేశారు. మొత్తానికి కేటీఆర్ మారు మాట్లాడకుండా లాక్ చేసి పడేశారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ అయితే తన సోదరి కవిత విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు. వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) తన సోదరి షర్మిల (YS Sharmila) విషయంలో ఎలా అయితే స్పందించలేరో.. అలాగే కేటీఆర్ కూడా..

కవిత కన్నీటి పర్యంతమయ్యారా?

కేవలం ఆస్తి గొడవల కారణంగానే కవితను ఇంటి నుంచి గెంటేశారని.. దీంతో కవిత కన్నీటి పర్యంతమయ్యారని రేవంత్ అన్నారు. అంతేకాకుండా సొంత చెల్లిని కాపాడలేని వ్యక్తి.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. కవిత ఆస్తి దక్కకుండా కుట్రలు పన్నారని రేవంత్ విమర్శించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ (BRS) - బీజేపీ (BJP) రహస్య ఒప్పందంలో ఉన్నారంటూ విమర్శించారు. కవితకు దక్కాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుట్ర పన్నారని.. బీఆర్ఎస్, బీజేపీ పరస్పర ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయన్నారు. కవిత కూడా తన సోదరుడు కేటీఆర్‌పై పరోక్ష విమర్శలు చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఇదంతా రేవంత్ వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్టుగా అవుతోంది.

మౌనం అర్థంగీకారం..

ఎందుకో.. తెలంగాణ, ఏపీలో రాజకీయాలు ఒకే మాదిరిగా టర్న్ తీసుకుంటున్నాయి. ఏపీలో జగన్ ఏదైతే తన చెల్లెలి విషయంలో చేశారో.. అదే తెలంగాణలోనూ జరుగుతోంది. బీఆర్ఎస్, వైసీపీ మంచి అస్త్రాలను అధికార పార్టీ చేతిలో పెట్టాయి. ఇద్దరు కూడా తమ చెల్లి అనే అస్త్రాలనే అధికార పార్టీ చేతుల్లో పెట్టారు. అసలే లేడీస్ సెంటిమెంట్ బాగుంటుంది. పైగా అధికార పార్టీ విమర్శలు గుప్పించినా కూడా అటు జగన్ కానీ.. ఇటు కేటీఆర్ కానీ మాట్లాడే పరిస్థితి ఉండదు. సొంత చెల్లి.. ఏం మాట్లాడినా వారిదే తప్పిదమవుతుంది. అలాగని సైలెంట్‌గా ఉన్నా కూడా మౌనం అర్థంగీకారం అయిపోతుంది. ఇలాంటి విషయాల్లో అన్నల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారుతుంది. ఒకవైపు చెల్లెలి విమర్శలతో తల బొప్పి కడుతుంటే మరోవైపు అధికార పార్టీ చేసే విమర్శలొకటి. విన్నా విననట్టుగా.. తమను కాదన్నట్టుగా ఊరుకోవాలంతే..

కేటీఆర్‌కు పట్టపగలే చుక్కలు..

ఇంకా కేటీఆర్‌కి అయితే కొంత మేర బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా కవిత అన్నపై విమర్శల పర్వానికి తెరదీయడం లేదు. వాస్తవానికి తొలినాళ్లలో షర్మిల కూడా అన్నపై విమర్శలు గుప్పించలేదు. ఆ తరువాత కానీ విమర్శలకు పదును పెట్టలేదు. అన్నకు ఈ మధ్య కాలంలో అయితే చుక్కలు చూపిస్తూ వస్తున్నారు. జగన్‌కు అతి పెద్ద హెడేక్‌గా షర్మిల మారారనడంలో సందేహమే లేదు. కేటీఆర్ సైతం అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. కవిత కూడా విమర్శలు మొదలు పెట్టారంటే.. కేటీఆర్‌కు సైతం పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం. కవిత వైపు ఎన్ని వేళ్లు చూపించినా కూడా కవిత చూపించే ఒక్క వేలు పైనే అందరి ఫోకస్ ఉంటుంది. మొత్తానికి ఏపీ మాదిరిగానే తెలంగాణ కూడా తయారైంది. రేవంత్ కూడా కేటీఆర్‌పై సోదరి పరంగా టార్గెట్ మొదలుపెట్టారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 2, 2025 12:59 PM