Telangana News: రేవంత్ క్యాబినెట్ కుదేలు.. ముగ్గురు కీలక మంత్రులపై వేటు!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో పెను సంచలనం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగనుందని, ఈ మార్పులకు ఢిల్లీ అధిష్టానం ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో పెను సంచలనం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగనుందని, ఈ మార్పులకు ఢిల్లీ అధిష్టానం ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని ఆంగ్ల పత్రిక ‘సౌత్‌ఫస్ట్’ సంచలన కథనం వెలువరించింది. కేబినెట్ (Revanth Cabinet) నుంచి ఏకంగా ముగ్గురు మంత్రులను తప్పించడానికి హైకమాండ్ నిర్ణయించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubleehills bypoll) కాంగ్రెస్ ఓడిపోతుందని అధిష్టానం ముందే ఒక అంచనాకు రావడం ఈ ప్రక్షాళనకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ముగ్గురు సీనియర్ మంత్రులపై వేటు?
‘సౌత్‌ఫస్ట్’ కథనం ప్రకారం, మంత్రివర్గం నుంచి తప్పించేందుకు సిద్ధమైన ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), కొండా సురేఖ (Konda Surekha)లను కేబినెట్ నుంచి తొలగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. వీరితో పాటు, రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు, కీలక మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy)ని కూడా మంత్రివర్గం నుంచి తప్పించడానికి ఢిల్లీ అధిష్టానం సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఈ ముగ్గురిపై వేటు వేయడానికి గల కారణాలపై స్పష్టత లేనప్పటికీ, పనితీరు, అంతర్గత సమీకరణాలు ప్రభావం చూపి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంచలన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో అంతర్గత ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.
కొత్త ముఖాలకు ఛాన్స్.. విజయశాంతి రీఎంట్రీ?
తొలగించే మంత్రుల స్థానంలో కొత్తగా ముగ్గురిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని ఆ పత్రిక వెల్లడించింది. కేబినెట్‌లోకి రాబోయే కొత్త ముఖాల్లో మహేశ్‌గౌడ్ (Mahesh Goud), బాలునాయక్ (Balu Nayak) పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi)ని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని కథనం పేర్కొంది. ఒకవేళ విజయశాంతి కేబినెట్‌లోకి వస్తే, ఇది తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరో కీలక పరిణామం అవుతుంది.
ముగ్గురికే మినహాయింపు!
మంత్రివర్గంలో మార్పులు ఇక్కడితో ఆగేలా లేవు. శ్రీధర్ బాబు (Sridhar Babu), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasareddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhaati Vikramarka) మినహా మిగిలిన మంత్రులందరి శాఖలను మార్చేందుకు ఢిల్లీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఈ కసరత్తు ఇప్పటికే మొదలైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా, ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే ఈ కేబినెట్ మార్పు ఉంటుందని కథనం స్పష్టం చేసింది. అయితే, అధిష్టానం సూచించిన ఈ భారీ మంత్రివర్గ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తిగా ఉన్నట్లుగా కథనంలో పేర్కొనడం, రానున్న రోజుల్లో ఢిల్లీ, గల్లీ నాయకత్వాల మధ్య సమన్వయంపై కొత్త చర్చకు తెర తీసింది. ముఖ్యమంత్రి తన అసంతృప్తిని ఎలా వ్యక్తం చేస్తారు, అధిష్టానం నిర్ణయాన్ని ఎంతమేరకు అంగీకరిస్తారు అనే అంశాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ కేబినెట్ ప్రక్షాళనతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం ఉంది.