Politics

Rammohan Naidu: రామ్మోహన్ నాయుడు Vs కృష్ణ చైతన్య.. ఇంట్రస్టింగ్‌గా ఉండబోతోందా?

ఏపీ రాజకీయాలు (AP Politics) ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటాయి. ఒకరి కంచుకోట మరొకరికి సొంతమవ్వొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏపీలో వచ్చేసి కొన్ని జిల్లాలు రాజకీయంగా చాలా చైతన్యాన్ని కలిగి ఉంటాయి.

Rammohan Naidu: రామ్మోహన్ నాయుడు Vs కృష్ణ చైతన్య.. ఇంట్రస్టింగ్‌గా ఉండబోతోందా?

ఏపీ రాజకీయాలు (AP Politics) ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటాయి. ఒకరి కంచుకోట మరొకరికి సొంతమవ్వొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏపీలో వచ్చేసి కొన్ని జిల్లాలు రాజకీయంగా చాలా చైతన్యాన్ని కలిగి ఉంటాయి. వాటిలో శ్రీకాకులం ఒకటి. ఈ జిల్లాలోని నరసన్నపేటను కంచుకోటగా మార్చుకోవాలని ధర్మాన కుటుంబం (Dharmana Family) శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ అప్‌ అండ్ డౌన్ అవుతూనే ఉంది. అయితే ఈసారి అంటే 2029 ఎన్నికల్లో ఎలాగైనా ఆ కుటుంబం నరసరావుపేటను దక్కించుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే రంగంలోకి ధర్మాన క్రిష్ణదాస్ తనయుడు కృష్ణ చైతన్య రంగంలోకి దిగుతున్నాడని టాక్. అక్కడి నుంచి నెక్ట్స్ టైం రంగంలోకి దిగేది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

నరసరావుపేట గురించి చెప్పాలంటే..

శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) రంగంలోకి దిగనున్నారని టాక్. అసలు ఆది నుంచి అంటే 1989 నుంచి చూసుకుంటే.. ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ఈ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అనంతరం 1994లో ఓటమి పాలవగా.. తిరిగి 1999లో విజయం సాధించారు. 2004లో ప్రసాదరావు సోదరుడు ధర్మాన క్రిష్ణదాస్ (Dharmana Krishna Das) రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన 2009, 2012 ఉప ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. తిరిగి 2014లో ఓటమి పాలవగా.. 2019లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి 2024లో మరోసారి ఓటమి పాలయ్యారు. ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తంగా ధర్మాన కుటుంబమే ఈ నియోజకవర్గాన్ని ఎక్కువగా దక్కించుకుంది.

ఇంట్రస్టింగ్‌గా 2029 ఎన్నికలు..

అలాగని టీడీపీ (TDP) ఏమీ తక్కువ తినలేదు. తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) పుట్టిన తర్వాత నరసరావుపేట నియోజకవర్గానికి పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువగా ఉన్నా కూడా టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడి నుంచి విజయం సాధించడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) కూడా ఒక కారణమని చెబుతారు. ఆయన ఈ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టి మరీ ఎమ్మెల్యేను గెలిపించుకున్నారట. అయితే 2029 అనేది చాలా ఆసక్తికరంగా ఇక్కడ ఉండబోతోందని ప్రస్తుతానికి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు నరసారావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. దీని కోసం ఆయన ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారట. వైసీపీ నుంచి క్రిష్ణదాస్ తనయుడు కృష్ణ చైతన్య (Dharmana Krishna Chaitanya) బరిలోకి దిగనున్నారట.

మచ్చుకు కూడా కనిపించని వ్యతిరేకత..

నరసరావుపేటను ఎవరైనా దక్కించుకోవాలనుకుంటే ఎన్నికల ముందు నియోజకవర్గంలో తిరిగితే సరిపోదు. ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాలి. వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు వర్సెస్ కృష్ణ చైతన్య (Rammohan Naidu Vs Krishna Chaitanya) బరిలోకి దిగనున్నారని టాక్ నడుస్తోంది కాబట్టి ఇంట్రస్టింగ్ చర్చంతా ఈ నియోజకవర్గం చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతా లేదు. ఒకవేళ ఉందన్నా కూడా దానికి ముందు అభివృద్ధి పేరిట పెద్ద గీత ఉంది కాబట్టి వ్యతిరేకత అనే చిన్న గీత ఇప్పటివరకైతే మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇక ముందు ఏమైనా కనిపిస్తే చూడాలి. మరి వస్తున్న వార్త నిజమే అయితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో అత్యంత ఇంట్రస్టింగ్ ప్లేస్ నరసరావుపేట అవుతుందనడంలో సందేహం లేదు.

ప్రజావాణి చీదిరాల

 

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 27, 2025 5:49 AM