Politics

YSRCP: వైసీపీలోకి ప్రకాశం జిల్లా కీలక నేత.. నిజమేనా?

ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీ ఫుల్ ప్యాక్ ఉంది.

YSRCP: వైసీపీలోకి ప్రకాశం జిల్లా కీలక నేత.. నిజమేనా?

ఏపీలో పాలిటిక్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఏపీలో పేరుకు కూటమి ప్రభుత్వం నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) వచ్చేసి బెంగుళూరు ఎలహంక ప్యాలెస్‌ (Elahanka Palace)లోనే ఉండిపోతున్నారు. ఏదైనా అధికారపక్షాన్ని నిందించే అవకాశం దొరికితే మాత్రమే ఏపీకి వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ నేతంతా కూడా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం కేవలం ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాత్రమే కాస్త అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. అది కూడా శాసనమండలిలోనే అనుకోండి. ఇక మిగిలిన నేతలంతా గప్‌చుప్.

ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీ ఫుల్ ప్యాక్ ఉంది. జనసేన, టీడీపీకి అయితే ప్రతి నియోజకవర్గంలోనూ నేతలు భారీగానే ఉన్నారు. ఒకవేళ ఏపీలో 225కి సీట్లు పెరిగినా కూడా ఇంకా కూటమి నేతలకు సరిపోవడం కష్టమే. అంతమంది ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు సైలెంటుగా ఉండిపోవాల్సి వస్తోందని టాక్. లేదంటే టీడీపీ (TDP), జనసేన (Janasena)ల్లో ఏ పార్టీలో చక్రం తిప్పే అవకాశం ఉన్నా కూడా వైసీపీ నేతలు దానిలోకి జంప్ అయి ఉండేవారే. కొత్తగా ఎవరైనా వెళ్లినా ఉపయోగం లేకపోవడం కారణంగానే అంతా సైలెంటుగా ఉంటున్నారని టాక్. ఇక ప్రస్తుతం వైసీపీ నేతలు అయితే తమకంటూ మంచి రోజులు రాకపోతాయా? అని ఎదురు చూస్తున్నారట.

ప్రస్తుతం వైసీపీ (YCP) అయితే తమ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ముందుకు నడిపించే నేతల కోసం సెర్చింగ్ మొదలు పెట్టిందట. ఈ క్రమంలోనే వైసీపీకి ఒంగోలులో కీలక నేత దొరికినట్టు టాక్ నడుస్తోంది. ఇటీవల వైసీపీ రీజనల్ స్థాయి (YCP Reasonal Level Meeting) సమావేశం ఒంగోలులో జరిగింది. ఈ సమావేశం చాలా మంది వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే ఆమంచి గురించి టాక్ నడిచిందని సమాచారం. ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishnamohan) వచ్చేసి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆమంచి తొలుత టీడీపీలోనే ఉండేవారు.

ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆమంచి ఓటమి పాలవడంతో పాటు మరో చిక్కు కూడా ఆయనకు వచ్చి పడింది. అదేంటంటే.. ఆయన రాజకీయ ప్రత్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి (Karanam Balaramakrishna Murthy) వైసీపీలో చేరడం. దీంతో బలరామకృష్ణమూర్తికి ప్రాధాన్యం పెరగడంతో క్రిష్టమోహన్ మనస్థాపంతో 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరారు. అది ఆమంచి కథ. ఇప్పుడు వైసీపీ నేతలు ఎలాగైనా ఆయనను పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 8, 2025 1:00 PM