Pawan Kalyan: పవన్‌కు షాక్.. డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్యే, డీఎస్పీ
అసలు డిప్యూటీ సీఎం (AP Deputy CM) దగ్గర తోక జాడించే అధికారులు మాత్రం ఎవరుంటారులే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తప్పనిసరిగా ఉంటారు కాదు.. కాదు ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan).. దాదాపుగా శాంతంగానే ఉంటారు. ఆయనకు ఎప్పుడో కానీ చిర్రెత్తుకు రాదు. దానికి కారణాలు ఉంటాయనుకోండి. ఇక ప్రభుత్వోద్యోగుల దగ్గర తన హోదాను చూపించిన దాఖలాలైతే లేవు. అసలు డిప్యూటీ సీఎం (AP Deputy CM) దగ్గర తోక జాడించే అధికారులు మాత్రం ఎవరుంటారులే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తప్పనిసరిగా ఉంటారు కాదు.. కాదు ఉన్నారు. ఆయనొక డీఎస్పీ. పేరు జయ సూర్య. ఈయన వెనుక ఓ ఎమ్మెల్యే ఉన్నారని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అంటారా?
వాస్తవానికి డిప్యూటీ సీఎం ఆదేశాలను ఒక ఎమ్మెల్యే అడ్డుకోవడం ఏంటి? వినడానికి విచిత్రంగా అనిపిస్తోంది కదా. మరి టాక్ అయితే గట్టిగానే సాగుతోంది. అసలేం జరిగిందంటే.. భీమవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారన్న సమాచారం పవన్ (Pawan)కు అందడంతో ఆయన ఫైర్ అయ్యారు. జిల్లాకు చెందిన పలువురు మహిళలు జూదం కారణంగా తమ కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయంటూ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వెంటనే డీఎస్పీ జయసూర్యకు జూదానికి చెక్ పెట్టమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఆయన పవన్ ఆదేశాలను బేఖాతరు చేసినట్టుగా సమాచారం.
ఎందుకిలా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు..?
అసలు ఇంత జరుగుతుంటే డీఎస్పీ చోద్యం చూడటమే వింత అంటే.. ఏకంగా డిప్యూటీ సీఎం (Pawan Kalyan) ఆదేశాలను బేఖాతరు చేయడం మరో వింత. మొత్తానికి ఈ విషయమై ఫోకస్ చేసిన పవన్.. పార్టీ నేతల (Janasena Party Leaders) కు సైతం డీఎస్పీ జయ సూర్య కదలికలపై ఫోకస్ పెట్టారు. అసలు డీఎస్పీ ఎందుకిలా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారనే విషయమై ఆరా తీయగా ఒక ఎమ్మెల్యే (MLA) ఉన్నట్టు తేలిందట. పవన్‌కు షాక్ ఇస్తూ ఆయన్ను డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్యే ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో డీఎస్పీ జయసూర్యపై పవన్ ఫైర్ (Pawan Serious) అవడంతో పాటు చర్య తీసుకోవాలంటూ హోంమంత్రి అనిత (Home Minister Anitha)కు సూచించారని సమాచారం.
బదిలీని ఆపేశారట..
ఇదంతా ఓకే కానీ డీఎస్పీ వెనుక ఉన్న ఎమ్మెల్యే ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేలకు పవన్‌కు ఎదురెళ్లేంత సీన్ లేదు. ఇక టీడీపీ (TDP)కి సంబంధించిన ఎమ్మెల్యేల్లో ఒకరు డిప్యూటీ స్పీకర్.. మరొకరు మంత్రి కాబట్టి వీరు కూడా కాదు.. మిగిలిన ఇద్దరు.. పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana), రాధాకృష్ణ అనుకున్నా కూడా వీరిద్దరూ పవన్‌తో సఖ్యంగానే ఉంటారని టాక్. మరి ఇంకెవరనేది ఎవరి ఊహలకూ అందకుండా ఉంది.. డీఎస్పీ జయసూర్య (DSP Jayasurya)ను బదిలీ చేసినా కూడా సదరు ఎమ్మెల్యే ఆ బదిలీని ఆపేశారట. అంత సీన్ ఉన్న ఎమ్మెల్యే ఎవరనేది ఆసక్తికరంగా మారింది. డీఎస్పీపై పవన్ విచారణకు ఆదేశాలు అయితే జారీ చేశారు.