Nara Lokesh: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని..
తాజాగా అమరావతి (Amaravthi)లో ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేశ్.. గూగుల్ పెట్టుడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని అలాగే విశాఖ రూపురేఖలను గూగుల్ మార్చబోతోందన్నారు.

ఏపీ (AP)కి మంచి రోజులు వచ్చేశాయి. రాజధాని (AP Capital) ఏంటో కూడా తెలియని ఏపీ ప్రజలకు తిరిగి అమరావతి (Amaravathi) రాజధానిగా ముస్తాబవుతోంది. ఏపీకి శాపంగా మారిన పోలవరాన్ని తిరిగి వరంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైసీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి తరలివెళ్లిపోయిన ప్రముఖ సంస్థలు తిరిగి రాగా.. వీటికి తోడుగా కొత్త సంస్థలు సైతం వస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌కు మకుటంలా హైటెక్‌సిటీ (Hitec City)ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏపీలో సాగరతీరం విశాఖకు మెరుగుదిద్దే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గూగుల్ (Google) సంస్థను విశాఖకు తీసుకొచ్చారు. దీనిలో మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) కృషి సైతం ప్రశంసనీయం.
తాజాగా అమరావతి (Amaravthi)లో ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేశ్.. గూగుల్ పెట్టుడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని అలాగే విశాఖ రూపురేఖలను గూగుల్ మార్చబోతోందన్నారు. విశాఖకు మణిహారంగా గూగుల్ మాత్రమే కాదని.. ఏఐ (AI)కి సంబంధించి సైతం పలు కంపెనీలు వస్తున్నాయని నారా లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా పలు దఫాలుగా గూగుల్ ప్రతినిధులతో తాను చర్చలు జరిపినట్టు వెల్లడించారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో సైతం చంద్రబాబు (Chandrababu) పలుమార్లు భేటీ అయ్యాని తెలిపారు. ఇలా అందరితో పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన మీదట ఇంత పెద్ద పెట్టుబడి సాగర తీరానికి తరలి వచ్చిందన్నారు. ఇవి మాత్రమే కాకుండా భారీ పెట్టుబడులపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు.
ఒకే రాష్ట్రం (One State).. ఒకే రాజధాని (One Capital).. అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యమని నారా లోకేష్ తెలిపారు. ప్రతి జిల్లాకు ఏదో ఒక రకమైన ఫ్యాక్టరీలు అయితే వస్తున్నట్టు వెల్లడించారు. అనంతపురం, కర్నూలుకు పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు (Cement Factories).. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్.. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) పెద్దఎత్తున పెట్టుబడులు.. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ (Quantum computing).. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా.. ఉత్తరాంధ్రలో టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్ (Cognizant), యాక్సెంచర్ (Accenture) వంటి పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఏపీలోని అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ది చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేశ్ వెల్లడించారు. ఎంవోయూలపై సంతకాలు కాదు.. ఆచరణలో చేసి చూపిస్తున్నామంటూ పనిలో పనిగా వైసీపీ (YCP)కి చురకలేశారు. గత ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం జరిగిందని నారా లోకేశ్ తెలిపారు.