PM Modi: నారా లోకేష్‌ను మీ నాన్నలా తయారవుతావన్న మోదీ.. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
‘త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు’ అంటూ మోదీ వ్యాఖ్యానించడం వెనుక మర్మమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఫిజికల్‌గా అలా తయారవుతారని అన్నారా? లేదంటే పొలిటికల్‌గా అలా తయారవుతావని అన్నారా?

ఏంటో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi).. మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఎదురుపడినప్పుడల్లా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. గతంలో ‘ఏంటి నన్ను కలవడమే లేదంటూ సరదాగా ప్రశ్నించిన మోదీ.. ఇప్పుడు బరువు తగ్గావంటూ ప్రశంసలు కురిపించారు. నారా లోకేశ్ ఎదురుపడినప్పుడల్లా మోదీ చిన్నపిల్లాడిని అన్నట్టుగా ఏదో ఒకటి సరదాగా అనేస్తూ ఉంటారు. అది కాస్తా వైరల్ అవడంతో పాటు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తాజాగా కూడా ఇదే జరిగింది.
బరువు బాగా తగ్గిపోయావంటూ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)తో ప్రధాని నరేంద్ర మోదీ (Modi) సరదా వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (గురువారం) ప్రధాని మోదీ.. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం ఏపీ (AP)కి వచ్చారు. ఈ క్రమంలోనే మోదీకి స్వాగతం పలికేందుకు ఉదయం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer), సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan)తో కలిసి లోకేశ్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో మోదీ మాట్లాడుతూ గతంలో తాను చూసినప్పటి కంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావని చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే మీ నాన్నలా తయారవుతావంటూ మోదీ వ్యాఖ్యానించారు.
ఫిజికల్‌గా అన్నారా?
అసలు మోదీ వ్యాఖ్యల వెనుక మర్మమేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బరువు తగ్గావనడంలో పెద్దగా వింతేమీ లేదు. ఎందుకంటే నారా లోకేష్ ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయారు. కానీ ‘త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు’ అంటూ మోదీ వ్యాఖ్యానించడం వెనుక మర్మమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఫిజికల్‌గా అలా తయారవుతారని అన్నారా? లేదంటే పొలిటికల్‌గా అలా తయారవుతావని అన్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత కొంతకాలంగా నారా లోకేష్‌లో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాజకీయాలకే పనికి రాడని.. చంద్రబాబుకు రాజకీయ వారసుడు లేడంటూ వైసీపీ (YCP) పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. లోకేష్‌ను బాడీ షేమింగ్ చేసింది. ఇంకా పొలిటికల్‌గానూ ఎన్నో విమర్శలు.. వాటన్నింటినీ లైట్ తీసుకుని లోకేష్ అన్ని విధాలుగా తనను తాను మార్చుకున్న తీరు ప్రశంసనీయం. కానీ ఆ తరువాత లోకేష్ ఎంతలా పరిణతి చెందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడా తడుముకోవడం లేదు. ఇవన్నీ చూసిన మీదటే మోదీ.. నారా లోకేష్‌ను త్వరలోనే మీ నాన్నలా తయావుతావని అన్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పంచామృతాలలో రుద్రాభిషేకం
అనంతరం మోదీ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి (Srisailam Mallikarjuna Swamy), అమ్మవార్లను ప్రత్యేకంగా మోదీ దర్శించుకున్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి పంచామృతాలలో రుద్రాభిషేకం (Rudrabhishekam), భ్రమరాంబదేవి (Bramaramba Devi)కి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం మోదీ అక్కడే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు.
ప్రజావాణి చీదిరాల