Donald Trump: ట్రంప్‌నకు చుక్కలు చూపించిన భారతీయ సినీ డైరక్టర్ కుమారుడు మమ్‌దానీ..
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (America President Donald Trump) దూకుడుకు కళ్లెం వేసే పరిస్థితులు ఎంతో దూరంలో లేవు. అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీ (Republican Party)కి షాకిచ్చాయి.
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (America President Donald Trump) దూకుడుకు కళ్లెం వేసే పరిస్థితులు ఎంతో దూరంలో లేవు. అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీ (Republican Party)కి షాకిచ్చాయి. ఏకంగా ట్రంపే రంగంలోకి దిగినా ఉపయోగం లేకుండా పోయింది. ఒకరకంగా నిధుల విషయంలో ఆంక్షలు విధిస్తానన్నా కూడా ఏమాత్రం ట్రంప్ (Trump) హెచ్చరికలను లక్ష్య పెట్టలేదు న్యూయార్క్ ప్రజానీకం. భారతీయ-ఉగాండా మూలాలున్న వ్యక్తిని గెలిపించి మరీ ట్రంప్‌నకు షాక్ ఇచ్చారు.
న్యూయార్క్ నగర మేయర్ పదవి కోసం ఎన్నికలు జరిగాయి. ఇవి అత్యంత కీలకంగా మారాయి. భారతీయ-ఉగాండా మూలాలున్న డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్‌దానీ (Zohran Mamdani) ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుఫున పోటీ చేశారు. ఆయన ఓటమి కోసం స్వయంగా రంగంలోకి ట్రంపే దిగారు. ఒకవేళ కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్‌దానీ న్యూయార్క్ మేయర్‌గా గెలిస్తే కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని ట్రంప్ సోషల్ మీడియా (Social Media) వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా జనం వెనుకడుగు వేయలేదు. మరో ఆలోచనే లేకుండా అతి పిన్న వయస్కుడైన (34) మమ్ దానీని మేయర్‌గా గెలిపించారు. మొత్తానికి ఇదో రికార్డ్ అనే చెప్పాలి.
మొత్తానికి మమ్‌దానీ జోహ్రాన్ అయితే న్యూయార్క్ మేయర్ అయిపోయారు. ఆయన ఎవరో తెలిస్తే షాకవుతారు. భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ (Meera Nayar) కుమారుడే ఈ మమ్‌దానీ. ఉగాండా జాతీయుడైన మహమూద్ మమ్‌దానీ-మీరాకు జన్మించిన సంతానమే జొహ్రాన్. సోషలిస్ట్ భావజాలం ఉన్న జోహ్రాన్ గెలిచింది ఎవరిపైనో తెలుసా? న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై.. సంచలన విజయమైతే మమ్‌దానీ జోహ్రాన్ క్రియేట్ చేశారు. ఇక మమ్‌దానీ విజయంలో కీలక పాత్ర పోషించిన హామీ మాత్రం ఉచిత సిటీ బస్సు ప్రయాణం. ఇద మాత్రమే కాకుండా నగరంలో అద్దెల స్థిరీకరణ, యూనివర్శల్ చైల్డ్ స్కీమ్, 2030 నాటికి కనీస వేతనాల పెంపు, చిరు జీవుల వ్యయాల తగ్గింపు వంటి హామీలతో జోహ్రాన్ విజయం సాధించారు.