Politics

Ajith Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇక లేరు. బారామతి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు.

Ajith Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇక లేరు. బారామతి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని డీజీసీఏ నిర్ధారించింది. ఈ సంఘటనతో మహారాష్ట్ర దిగ్భ్రాంతికి గురైంది. రాజకీయ వర్గాలు ఒక్కసారిగి నివ్వెరబోయాయి. ప్రస్తుతం బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల ప్రచార సమావేశాల కోసం బారామతి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి అజిత్ పవార్ బయలుదేరారు.

విమానం ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడటంతో ఒక్కసారిగా పైలట్ నియంత్రణ కోల్పోయారు. దీంతో విమానం కూలిపోయింది. ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున పొగ ఆ ప్రాంతమంతా విస్తరించింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. మరణ వార్త తెలియడంతో బారామతి సహా రాష్ట్రమంతా విషాద వాతావరణం అలుముకుంది. సమావేశ స్థలంలో ఉన్న నేతలు, కార్యకర్తలు హుటాహుటిన అజిత్ పవార్‌ను తీసుకెళ్లిన ఆసుపత్రికి చేరుకున్నారు. విమాద ప్రమాదానికి సంబంధించిన కారణాలైతే ఇంకా తెలియరాలేదు. అజిత్ పవార్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 28, 2026 4:57 AM