Nara Lokesh: లోకేశ్ తస్మాత్ జాగ్రత్త.. ఆ ఇద్దరు మనోళ్లు కాదు ‘పగోళ్లు’!
ఇండిగో విమానయాన సంక్షోభం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక ఊపు ఊపేసింది. అయితే, ఈ సంక్షోభం కారణంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాటి ఏకంగా అమెరికాలోని డల్లాస్ వరకు హైలైట్ కావడం విచిత్రమైన, విమర్శనాత్మక పరిణామం.
ఇండిగో విమానయాన సంక్షోభం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక ఊపు ఊపేసింది. అయితే, ఈ సంక్షోభం కారణంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాటి ఏకంగా అమెరికాలోని డల్లాస్ వరకు హైలైట్ కావడం విచిత్రమైన, విమర్శనాత్మక పరిణామం. ఆర్టీవీ (Republic TV) డిబెట్‌లో లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తబోయి, ఆ పార్టీ నేతలు ప్రదర్శించిన అతి భక్తి, సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల పార్టీ పరువు గంగలో కలిపేసిన వైనంపై ఇప్పుడు సొంత పార్టీలోనే నిప్పులు చెరుగుతున్నారు.
అసలే అరుపులు, మెరుపులకు కేరాఫ్ అడ్రస్ అయిన వన్ అండ్ ఓన్లీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామితో డిబెట్ పంచుకోవడం అంటే ఆషామాషీ విషయం ఏమీ కాదు. అలాంటి వ్యక్తితో మాట్లాడాలంటే కేవలం బుర్ర మాత్రమే కాదు, బాడీలోని ప్రతీ పార్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. ఒకటికి రెండు సార్లు కాదు, వెయ్యిసార్లు ఆలోచించి మరీ మాట్లాడాల్సి ఉంటుంది. పొరపాటున ప్రయోగాలు చేస్తే ఆయన చేతికి చిక్కినట్లే.. ఇక ఉతుకుడే ఉతుకుడు! కానీ, సరిగ్గా ఏదైతే చేయకూడదో అదే చేసి, టీడీపీకి డ్యామేజ్ చేశారు ఆ పార్టీ ముఖ్య నేతలు ఇద్దరు. ఆ ఇద్దరూ ఎవరో కాదు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్.
జాడే లేకున్నా హైలైట్!
ఇదంతా మొదలైన ఘనకార్యం దీపక్ రెడ్డితోనే. జేసీ బ్రదర్స్‌కు అల్లుడు, అనంతపురం ఎమ్మెల్సీ అయిన దీపక్ రెడ్డి గుణపాటి, రాష్ట్ర రాజకీయాలపై పట్టు ఉండటం, ఇంగ్లీష్ రావడంతో నేషనల్ మీడియా డిబెట్స్‌లో పాల్గొంటుంటారు. రోజువారీగానే డిబెట్‌కు పోయిన దీపక్ రెడ్డి.. ఇండిగో సంక్షోభానికి లోకేష్ వార్ రూమ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నాడని ఒకే ఒక్క మాట అనడమే ఇక్కడ చేసిన అతి పెద్ద తప్పిదం. ఇక్కడే అడ్డంగా దొరికిపోయాడు దీపక్ రెడ్డి. అసలు ఇవన్నీ చేయడానికి, పర్యవేక్షించడానికి లోకేష్ ఎవరు? ఆయన రాష్ట్ర, కేంద్ర శాఖల మంత్రా? అంటూ అర్నబ్ ఒక్క రేంజిలో ఆటాడుకున్నారు. ఈ దెబ్బతో టీడీపీ అభిమానులు, వీక్షకులు నివ్వెరపోయారు. సీన్ కట్ చేస్తే, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కంటే ఎక్కువగా లోకేషే ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయిపోయారు. చూశారుగా, ఏదో అనుకుని ఇంకేదో మాట్లాడిన దీపక్ దెబ్బకు పరిస్థితి ఎటు నుంచి ఎటు పోయిందో. అసలు ఈ మొత్తం వ్యవహారంలో లోకేష్ జాడే లేడు. ఆయన డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ కార్యకర్తలు, నేతల సమావేశంలో ఉండటం ఈ వ్యవహారంలో మరింత గాయంపై కారం చల్లినట్లు అయింది.
పోయిన పరువు తేబోయి..!
ఇదంతా మొదటి రోజు జరిగితే, రెండో రోజు పోయిన పరువును తీసుకొని వద్దాం అనుకున్నాడేమో కానీ.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ రంగంలోకి దిగాడు. అయితే, ఈయన్ని కూడా గట్టిగానే అర్నబ్ కుమ్మిపడేశాడు. ‘మీ టీడీపీ మంత్రి, ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు..? ఆటాడుకుంటున్నాడా..? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా..? సమాధానం చెప్పండి. ఫోన్ చేయండి.. ఎందుకనీ ఫోన్ లిఫ్ట్ చేయడంలేదు.. స్విచాఫ్ ఎందుకు చేశాడు?’ అంటూ గోస్వామి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మొత్తమ్మీద రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా రాజీనామా చేయాలని అర్నబ్ గోస్వామి గట్టిగానే పట్టుబట్టారు. అయితే, ఇదంతా పట్టాభిరామ్ ఎంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా, అంతకు రెట్టింపుగా అర్నబ్ చితక్కొట్టాడు. ఈ ఇద్దరి తీరు చూసి, అర్నబ్ ఏమైనా బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి డైలాగ్ చెప్పినట్లు.. ‘ఒక్కటే కొట్టుడు.. అది కూడా చితక్కొట్టుడు’ కొట్టాడని నెటిజన్లు, విమర్శకులు కామెంట్లు చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ, అంతకుమించి రచ్చ.
సొంత పార్టీలో రచ్చ.. వైసీపీ పండుగ!
అటు దీపక్ రెడ్డి, ఇటు పట్టాభిరామ్ వ్యవహారాలను అదునుగా చేసుకున్న వైసీపీ శ్రేణులు, నెటిజన్లు ఇప్పుడు ఆటాడుకుంటున్నారు. ఇన్నాళ్లు టీడీపీ నేతలని చంకన ఎక్కించుకుని పదవులు కూడా ఇస్తే, ఇప్పుడేమో వీళ్లు పార్టీని, అగ్రనేతల పరువు తీస్తున్నారని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. ‘అసలు ఎవడ్రా బాబు వీళ్లను డిబేట్స్ పోమ్మని చెప్పింది.. అవసరమా..? ఇంత అతి.. పోయి పోయి అర్నబ్ డిబెట్‌కు పోతారా’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మాత్రం లోలోపల పండుగ చేసుకుంటోంది. ‘అరెరే.. మనం ఇన్నాళ్లు దీపక్, పట్టాభిని పగోళ్లు అనుకున్నాం కానీ.. మనోళ్లే! టీడీపీ పరువు తీసి.. మొత్తం గంగలో కలిపేశారు’ అంటూ హ్యాపీగా చెప్పుకుంటున్నారు. ‘ఎంతైనా మనోళ్లు ఇద్దరూ సూపర్ అబ్బా, ఇన్నాళ్లు వాళ్లను పగోళ్లు అనుకున్నాం.. మనోళ్లే’ అని టీడీపీ నేతలను వైసీపీ వాళ్లు ఓన్ చేసుకుంటున్నారు. ‘మనం నెలరోజులైనా చెయ్యలేని డ్యామేజ్‌ని రెండంటే రెండే నిమిషాల్లో చేసి చూపించారు’ అని వైసీపీ వీరాభిమానులు సాయిరాం అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. లోకేష్ గారూ, ఆ ఇద్దరు మనోళ్లు కాదు.. మీ పగోళ్లు అని టీడీపీ శ్రేణులే ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో ఇమే
ప్రజావాణి చీదిరాల