Balakrishna: అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం..
అమరావతి.. ఏపీ ప్రజల ఆత్మగౌరవం. ఇన్నాళ్లకు తమకు రాజధాని ఉంది అని గర్వంగా చెప్పుకునే క్షణమిది. ఇదొక చారిత్రక విజయ క్షణమని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం అభివర్ణించారు.
అమరావతి.. ఏపీ ప్రజల ఆత్మగౌరవం. ఇన్నాళ్లకు తమకు రాజధాని ఉంది అని గర్వంగా చెప్పుకునే క్షణమిది. ఇదొక చారిత్రక విజయ క్షణమని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం అభివర్ణించారు. దీనికి సంబంధించిన ప్రకటనను నేడు ఆయన విడుదల చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామన్నారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ప్రధాని నరేంద్రమోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, హోంమంత్రి అమిత్ షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
‘‘అమరావతి.. మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు ప్రతీక. రాజధాని రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు లభించిన న్యాయం ఇది. మనందరం కలిసి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా.. రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీల సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని బాలకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు.