Konda Surekha: ఎప్పుడో మాటలనేసి ఇప్పుడు క్షమాపణంటే ఎలా? నాగ్ స్పందిస్తారా?
ఏదైనా తప్పు చేస్తే వెంటనే గ్రహించి క్షమాపణ చెప్పాలి. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందిస్తానంటే.. ఆ స్పందనలో నిజాయితీ ఎక్కడిది?
ఏదైనా తప్పు చేస్తే వెంటనే గ్రహించి క్షమాపణ చెప్పాలి. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందిస్తానంటే.. ఆ స్పందనలో నిజాయితీ ఎక్కడిది? పైగా పరువు నష్టం కేసు చాలా కాలంగా నడుస్తోంది. దాని మరుసటి విచారణకు ఒక్క రోజు ముందు ఆ వ్యాఖ్యలపై స్పందిస్తానంటే క్రెడిబులిటీ ఉంటుందా? అనడానికి ముందు ఆలోచించాలి. లేదంటే అన్న తర్వాతైనా ఆలోచించి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడో అనేసి.. ఇప్పుడు తీరికగా క్షమాపణ చెబుతానంటే ఎలా?
ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదేనండి.. మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) గురించి.. ఎప్పుడో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వాటికి ఇప్పుడు క్షమాపణ చెప్పారు. దానికి కారణం లేకపోలేదులెండి. కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యలపై ఇండస్ట్రీ మొత్తం భగ్గుమంది. నాగార్జున సైతం ఆమెపై పరువు నష్టం దావా (Defamation lawsuit) వేశారు. ఆ కేసుపై ఇప్పటికీ నాంపల్లి కోర్టు (Nampally Court)లో విచారణ నడుస్తోంది. అయితే ఈ పిటిషన్‌పై నవంబర్ 13న అంటే రేపు విచారణ జరుగనుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖ నేడు క్షమాపణలు చెప్పారు.
‘‘సినీ నటుడు నాగార్జున గురిచి నేను చేసిన వ్యాఖ్యలు.. ఆయననో లేదంటే ఆయన కుటుంబాన్నో బాధపెట్టాలని చేసినవి కాదు. వారిని బాధ పెట్టాలని కానీ.. వారి పరువు తీయాలన్న ఉద్దేశం కానీ నాకు లేవు. వారి విషయంలో నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’’ అంటూ కొండా సురేఖ పేర్కొన్నారు. మొత్తానికి ఒకరోజు ముందు తను చేసిన తప్పిదంపై కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ క్షమాపణ ఏదో ముందుగానే చెప్పి ఉంటే బాగుండేది కానీ ఇంతకాలం తర్వాత ఇప్పుడు చెప్పడమే ఏమాత్రం బాగోలేదు. అది కూడా కోర్టు కేసుకు ఒకరోజు ముందు. అనాల్సినవన్నీ అనేసి.. తీరికగా క్షమాపణ చెప్పేస్తే సరిపోతుందా? ఏమో దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. ఆమె క్షమాపణలను పెద్ద మనసుతో స్వీకరిస్తారా? లేదంటే ఇంతకాలానికి చెప్పారు కాబట్టి క్రెడిబులిటీ లేదని లైట్ తీసుకుంటారా? చూడాలి.
ప్రజావాణి చీదిరాల