Politics

ఫామ్‌హౌస్ నుంచి సడెన్‌గా కేసీఆర్ మాయం.. 3 రోజులుగా ఆ హోటల్లోనే..!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో లేరంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆయన మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మూడు రోజులుగా ఆ ముగ్గురూ ఓ హోటల్లో ఉన్నారంటూ కథనాలు వినవస్తున్నాయి.

ఫామ్‌హౌస్ నుంచి సడెన్‌గా కేసీఆర్ మాయం.. 3 రోజులుగా ఆ హోటల్లోనే..!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో లేరంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆయన మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మూడు రోజులుగా ఆ ముగ్గురూ ఓ హోటల్లో ఉన్నారంటూ కథనాలు వినవస్తున్నాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? వస్తున్న వార్తలు ఎంత వరకూ నిజం? పైగా అంత సీక్రెట్‌గా వెళ్లి హోటల్‌లో మకాం వేయాల్సిన అవసరం కేసీఆర్‌కు ఏముంది? తెలుసుకుందాం.

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడున్నారంటే ఠక్కున చెప్పే మాట ఎర్రవల్లి ఫామ్‌హౌస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన నాటి నుంచి కేసీఆర్ పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఎప్పుడో ఒకసారి కలుగు నుంచి ఎలుక బయటకు వచ్చినట్టుగా అలా బయటకు వచ్చి తిరిగి ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోతున్నారు. గడప దాటని మనిషిపై గాసిప్పులే రాజ్యం చేస్తాయట. అలాంటిదేనా.. ఇది కూడా?

లెక్కలు తేల్చుకునేందుకేనా?

కేసీఆర్ ఒక్కసారిగా మాయమయ్యారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ ఎలా మాయమయ్యారు? ఎందుకు మాయమయ్యారు. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ ఆ మధ్య ఒకసారి బయటకు వచ్చినప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఢంకా భజాయించారు. ఆ లెక్కలు తేల్చుకునేందుకు అదృశ్యమయ్యారా? ఇంతకీ ఆ ముగ్గురూ హోటల్‌లో మకాం వేశారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? అనేది తెలియకుండా ఉంది. పోనీ నిజమే అనుకుందామా? అంటే కేసీఆర్ అయితే బయటి ప్రపంచాన్నీ ఏదో కొన్ని నెలలకోసారి మినహా చూడటం లేదు. ఇక ఆ ముగ్గురిలో మరో ఇద్దరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అనుకున్నా కూడా వారిద్దరూ బయట కనిపిస్తూనే ఉన్నారు. మరి ఏ ముగ్గురు? ఏ హోటల్‌? చెప్పని పేర్లు వెయ్యి అనుమానాలు తావిస్తాయని అంటారు. ఇది కూడా అలాగే ఉంది.

ఊహలకు తలుపులు తెరిచినట్టే..

నిప్పులేనిదే పొగరాదు అంటారు. ఇలాంటి వార్తలను అబద్ధాలుగా కొట్టిపడేయలేం. ఒకరోజు ముందుగానే ఫార్మ్ హౌస్ నుంచి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా వెళ్లిపోవడమే కాకుండా, హోటల్ కి ఎవరూ రాకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏదిఏమైనా తలుపులు మూస్తే ఊహలకు తలుపులు తెరిచినట్టే అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోందా? అనే సందేహమూ లేకపోలేదు. పైగా కేసీఆర్ ఉన్న హోటల్ చాలా ఖరీదైనదని.. అక్కడ మూడు రోజులుగా తన అనుచరులతో ఆయన భేటీ అవుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ప్రైవేట్ కార్యకలాపాల కోసమే ఎవరినీ కలవకుండా, ఎవరి కంటా పడకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మూడు రోజులుగా అదృశ్యం కావడంతో పార్టీ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పైగా ఆ ఖరీదైన హోటల్ ఫామ్‌హౌస్‌కు ఎదురుగానే ఉందట.

ఇంత సీక్రెట్‌గానా?

ఇది నిజమే అనుకున్నా కూడా ఫామ్‌హౌస్‌కి ఎదురుగా ఉన్న హోటల్‌కి వెళ్లాల్సిన అవసరం కేసీఆర్‌కేంటి? అదే తన ఫామ్‌హౌస్‌లోనే ఉండి చర్చలు నిర్వహిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది కదా? పైగా ఏదో పార్టీ కార్యకలాపాల్లో ఉన్నారులే అని అంతా సరిపెట్టుకుంటారు. ఇంత సీక్రెట్‌గా చర్చలు నిర్వహించాల్సిన అవసరమేంటి? పైగా కేసీఆర్ ప్రస్తుతం అధికారంలో కూడా లేరు. అలాంటప్పుడు అధికార పార్టీ విపక్ష నేతల కార్యకలాపాలపై డేగ కన్నేసి మరీ కనిపెట్టుకుని ఉంటుంది. ఇదంతా పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్‌కు తెలియనిది కాదు. పోనీ ఈ వార్తలను కేటీఆర్ కానీ.. హరీష్ రావు కానీ స్పందించిందీ లేదు. పైగా లెక్క వేరేలా ఉంటుందన్న కేసీఆర్ తిరిగి మౌనం వహించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. నాయకుడి మౌనం కూడా ఓ ప్రకటనేనని అంటారు. అలా లెక్కలు తేల్చే పనిలోనే ఖరీదైన హోటల్‌కు కేసీఆర్ వెళ్లారా? అనేది కూడా సందేహంగానే ఉంది. ఇక చూడాలి వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 26, 2026 9:17 AM