Kavitha comments on BRS: తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టారని జాతీయస్థాయికి?
శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీఆర్ఎస్‌ను బట్టలిప్పి రోడ్డుపై నిలబెట్టిన కవిత మరింత ఆశ్చర్యం కలిగించేలా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంపై వ్యాఖ్యలు చేశారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీఆర్ఎస్‌ను బట్టలిప్పి రోడ్డుపై నిలబెట్టిన కవిత మరింత ఆశ్చర్యం కలిగించేలా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంపై వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శాసనమండలిలో కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం జరిగిందని.. ఆ మీటింగ్‌కు తాను హాజరు కాలేదని తెలిపారు. తాను పేరు మార్పునకు కానీ.. నేషనల్ పాలిటిక్స్‌కు వెళ్లడానికి సైతం తాను ఒప్పుకోలేదన్నారు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టినమని నేషనల్‌కు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో చేయాల్సినవి ఎన్ని పనులు మిగిలి ఉన్నాయని కవిత ప్రశ్నించారు. రెండు పెద్ద నదులైన కృష్ణా, గోదావరి నదులు ఉన్నాయని.. వాటిలో కృష్ణా నది కోసం ఒక లక్షా 89 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా వెల్లడించారు.
కొత్తగా ఇచ్చిన ఆయకట్టు 14 లక్షల ఎకరాలని తెలిపారు. ఒక లక్షా 89 వేల కోట్లలో ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టినా కూడా 20 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వవచ్చన్నారు. కానీ ఇంత ఖర్చు పెడితే జరిగింది.. ఒరిగింది మాత్రం ఒకరికేనన్నారు. తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకుంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితాలో 45వ స్థానాన్ని కాంట్రాక్టర్ దక్కించుకున్నాడని కవిత వెల్లడించారు. ఆయనకు మించి ఎవరికీ ఏమీ ఒరగలేదన్నారు. ఇల్లు లేని పేద ప్రజలకు ఇళ్లు అయితే రాలేదు కానీ ఆ సంస్థకు మాత్రం లక్షా 2 వేల 666 కోట్ల విలువైన ప్రాజెక్టులు వెళ్లాయని కవిత చెప్పారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం కవిత చెప్పలేదు.
ప్రజావాణి చీదిరాల