Jubleehills Bypoll: కాంగ్రెస్‌కే పట్టంగట్టిన సర్వే సంస్థలు.. విజయ ధీమాతో బీఆర్ఎస్
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిన్నటి వరకూ జూబ్లీహిల్స్ బైపోల్ (Jubleehills Bypoll) నడిచింది. ఎప్పటి మాదిరిగానే ఓటర్లు పెద్దగా పోలింగ్‌కు మొగ్గు చూపలేదు. ఏదిఏమైనా ఓటర్లైతే తమ తీర్పును ఈవీఎం (EVM)లలో నిక్షిప్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిన్నటి వరకూ జూబ్లీహిల్స్ బైపోల్ (Jubleehills Bypoll) నడిచింది. ఎప్పటి మాదిరిగానే ఓటర్లు పెద్దగా పోలింగ్‌కు మొగ్గు చూపలేదు. ఏదిఏమైనా ఓటర్లైతే తమ తీర్పును ఈవీఎం (EVM)లలో నిక్షిప్తం చేశారు. ఇక గెలుపు ఎవరిదనేదే మిగిలిన కథ. ఈ కథ కూడా ఈనెల 14వ తేదీన ముగుస్తుంది. ఇక సర్వే సంస్థలు సైతం ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అంచనాలను వివరించాయి. దాదాపుగా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ (Congress Party)కే అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీగానే నడిచింది. ఎగ్జిట్ పోల్స్‌లో సైతం ఈ రెండు పార్టీల మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. విజయం అనేది ఏ పార్టీకైనా స్వల్ప ఓట్ల తేడాతోనే ఉంటుందనేది స్పష్టం.
వాస్తవానికి బీఆర్ఎస్‌కు ఇది సిట్టింగ్ స్థానం. బీఆర్ఎస్ నాయకుడు దివంగత మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పార్టీ తరుఫున ఆయన సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. వీరితో సహా మొత్తంగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినా సరే పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యే ఉందని చెప్పాలి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే మాత్రం ద్విముఖ పోటీ అనే విషయం తేటతెల్లమవుతోంది. అయితే గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఎవరి ధీమా వారికి ఉంటుంది. ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదని బీఆర్ఎస్.. ఎలాగైనా తమ ఖాతాలో మరో స్థానాన్ని యాడ్ చేసుకోవాలని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించింది.
ఎగ్జిట్ పోల్స్ వివరాల ప్రకారం..
సర్వే సంస్థ కాంగ్రెస్(ఓట్లశాతం) బీఆర్ఎస్(ఓట్లశాతం) బీజేపీ(ఓట్లశాతం)
చాణక్య స్ట్రాటజీస్: 46 శాతం 43 శాతం 6 శాతం
హెచ్‌ఎంఆర్: 48.3శాతం 43.18శాతం 5.84 శాతం
స్మార్ట్ పోల్ సర్వే: 48.2శాతం 42.1 శాతం 7.6 శాతం
పబ్లిక్ పల్స్: 48.5 శాతం 41.8 శాతం 6.5 శాతం
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో మొత్తంగా 48.47 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు.. 2,85061 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1,92779 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సర్వేలను బట్టి చూస్తే 8 శాతం లోపే బీజేపీకి ఓట్లు నమోదయ్యాయి. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి హేమాహేమీలు ప్రచారం నిర్వహించినా కూడా ఇక్కడ పెద్దగా ఓట్లను రాబట్టలేకపోయినట్టు సర్వేలను బట్టి తెలుస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి హరీష్‌రావు, కేటీఆర్ వంటివారు ప్రచారం నిర్వహించారు. మొత్తానికి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ వివరాలను వెల్లడించినా కూడా బీఆర్ఎస్ మాత్రం విజయంపై ధీమాతోనే ఉంది. మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది.. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రజావాణి చీదిరాల