Janasena: నిలిచి గెలిచిన పవన్.. నేడు ఆయనో చరిత్ర..
ఎన్ని మాటలు.. ఎన్ని అవమానాలు.. ఎన్నింటినో తట్టుకుని నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు సింహాసనాన్ని అధిరోహించారు. అది ఆయన ఓపికకు దక్కిన గౌరవం.. ప్రస్తుతం పవన్ ఒక ప్రభంజనం..
ఎన్ని మాటలు.. ఎన్ని అవమానాలు.. ఎన్నింటినో తట్టుకుని నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు సింహాసనాన్ని అధిరోహించారు. అది ఆయన ఓపికకు దక్కిన గౌరవం.. ప్రస్తుతం పవన్ ఒక ప్రభంజనం.. ఎంతో మందికి పవన్ ఒక ఇన్స్పిరేషన్. ఆయనను పర్సనల్‌గా టార్గెట్ చేశారు. ఎన్నో విధాలుగా దెబ్బతీయాలని చూశారు. షూటింగ్ కు గ్యాప్ వస్తే రాజకీయాల్లో హడావుడి చేస్తాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన రాజకీయ ఇబ్బంది లేకుండా మిడ్ నైట్ షూటింగ్ చేసుకుంటున్నారు.
ఏదైనా ఒక పార్టీని నిలబెట్టాలంటే ఓవర్‌నైట్‌లో జరిగేది కాదు... ఎన్నో సంవత్సరాల కష్టం.. ఎన్నో బాధలు.. ఎన్నో అవమానాలు.. అన్నీ కలిస్తే విజయం. జనసేన పార్టీ రాజకీయాల్లో అడుగు పెట్టింది. ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును కైవసం చేసుకుంది. చివరకు అధినేత పవన్ కల్యాణ్ సైతం ఓటమి పాలయ్యారు. విజయం సాధించిన ఒక్క సీటు కూడా ఆ తరువాత అధికార పార్టీ వైపు అడుగులు వేసింది. అయినా సరే.. వెనుకడుగు వేయలేదు. నిరుత్సాహ పడలేదు. పార్టీని.. కార్యకర్తలను ఏకతాటిపై నడిపించి సక్సెస్ అయ్యారు.
మూణ్ణాళ్ల ముచ్చటే..
కట్ చేస్తే 2024 ఎన్నికలు.. పోటీ చేసిన ప్రతి చోటా విజయం సాధించింది. తనకు తిరుగులేదని నిరూపించుకుంది. జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. అంటే 13వ ఏట అడుగు పెట్టింది. హైదరాబాద్.. మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభ నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో ఎవరూ నమ్మలేదు. ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా ఇది కూడా మూణ్ణాళ్ల ముచ్చటేనంటూ సెటైర్లు వేశారు. షూటింగ్ గ్యాప్‌లో వస్తారని.. పొలిటికల్ కమెడియన్ అంటూ కూడా అవమానించారు. చివరకు వ్యక్తిగతంగానూ ఎన్నో మాటలు.. పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చి నైతికంగ దెబ్బతీసేందుకు సైతం యత్నించారు. వేరొకరైతే రాజకీయాలొద్దని వెళ్లిపోయేవారేమో.. కానీ పవన్ అన్నింటినీ తట్టుకుని నిలిచారు కాబట్టే ఇప్పుడు ఆయనొక చరిత్ర.
వైసీపీకి టెర్రర్..
జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత నుంచి ప్రత ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఆవిర్భావ దినోత్సవానికి పవన్ ఫ్యాన్స్, పార్టీ నేతలు, కేడర్ పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. వాస్తవానికి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలను పవన్ ఈ ఆవిర్భావ సభల్లోనే తీసుకున్నారు. పొత్తుల నుంచి కూటమి వరకూ అనేక నిర్ణయాలు ఈ సభల్లోనే ప్రకటించారు. అందుకే ఆవిర్భావ సభ అంటేనే వైసీపీకి టెర్రర్. పవన్ ఏం మాట్లాడుతారో.. ఏం వినాల్సి వస్తుందోనని భయపడి పోతుంటారు. గతేడాది అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జరిగిన ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పిఠాపురంలో పెద్ద ఎత్తున నిర్వహించారు.
గిరిజనులతో సహపంక్తి భోజనం..
అయితే ఈసారి ఈ వేడుకలను రద్దు చేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా, నగర, మండల స్థాయిల్లో ఎక్కడిక్కడ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. పవన్ మరో అనూహ్య నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈసారి గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గిరిపుత్రులతో మాటా మంతీ ప్రోగ్రామ్ నిర్వహించడంతో పాటు వారితో మధ్యాహ్నం సహపంక్తి భోజనం కూడా చేయనున్నారు. అడవితల్లి బాట కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నారు.
ప్రజావాణి చీదిరాల