YS Jaganmohan Reddy: వర్షాకాలంలో జరిగిన దానిపై శీతాకాలంలో స్పందించిన జగన్
ఎప్పుడో జరిగిన పెళ్లికి ఇప్పుడు బాజాలు మోగిస్తే విలువేముంటుంది? అప్పుడెప్పుడో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hindupur MLA Balakrishna) అసెంబ్లీ (AP Assembly)లో చేసిన వ్యాఖ్యాలపై..
ఎప్పుడో జరిగిన పెళ్లికి ఇప్పుడు బాజాలు మోగిస్తే విలువేముంటుంది? అప్పుడెప్పుడో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hindupur MLA Balakrishna) అసెంబ్లీ (AP Assembly)లో చేసిన వ్యాఖ్యాలపై తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) స్పందించారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. జగన్ (Jagan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిండు అసెంబ్లీలో ఒక పార్టీ అధినేతను సైకోగాడు అంటూ వ్యాఖ్యానించడం దారుణం. ఆ సమయంలో వైసీపీ నేతలు (YCP Leaders) దీనిని ఖండించారు. అంతా సమసిపోయింది. ఇదంతా జరిగి కూడా చాలా రోజులవుతోంది. ఇన్నాళ్లకు తీరుబడిగా ఈ వ్యవహారంపై జగన్ స్పందించారు.
ఆ స్పందన కూడా సాధారణంగా లేదు. చాలా ఘాటుగా.. ఒకరకంగా చెప్పాలంటే.. బాలయ్య (Balayya)పై ఎన్నడూ చేయని రీతిలో జగన్ విమర్శలు గుప్పించారు. బాలయ్య తాగేసి అసెంబ్లీకి వచ్చారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తాగేసి అసెంబ్లీకి వచ్చిన వ్యక్తిని ఎలా సభలోకి అనుమతించారంటూ ప్రశ్నించారు. బాలయ్య అలా మాట్లాడటం ఎంత తప్పో.. స్పీకర్‌ది సైతం అంతే తప్పు ఉందని అన్నారు. బాలయ్యకు మానసిక ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా ఆరోపించారు. ఈ విషయంలో బాలయ్య తనను తాను ప్రశ్నించుకోవాలని.. అసలు అసెంబ్లీలో బాలయ్య చేయాల్సింది అలాంటి వ్యాఖ్యలేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనీ పాటా లేని మాటలు మాట్లాడారంటూ విమర్శించారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ రెండు విషయాలు చర్చించుకోవాలి.
ఒకటేంటంటే.. బాలయ్య మాట్లాడిన దాదాపు నెల రోజుల తర్వాత ఆ వ్యాఖ్యలపై స్పందించడం. జగన్‌కు ఇప్పుడే తెలిసిందా? అసలు రచ్చంతా జరిగి సమసిపోయిన తర్వాత ఇప్పుడు జగన్ స్పందించడం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. ఆ విషయం పక్కనబెడితే బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అక్షరాలా తప్పే. కానీ జగన్ ఏమీ తక్కువ తినలేదు కదా.. ఆయన కూడా ఓ ప్రజాప్రతినిధి గురించి ఒకరకంగా దారుణమైన వ్యాఖ్యలే చేశారు. బాలయ్య తాగేసి అసెంబ్లీకి వచ్చారని.. ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ కరెక్ట్?. మొత్తానికి దొందు దొందే అనుకోవాలా? వాస్తవానికి రాజకీయాల్లోకి రావడానికి పూర్వం.. బాలయ్యకు జగన్ అభిమాని. ఆ అభిమానంతోనో మరొకటో కానీ జగన్ ఏనాడు బాలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించింది లేదు. కానీ ఇన్నాళ్లకు జగన్ మాట జారారు. ఇప్పుడు చెల్లుకు చెల్లు అనుకోవాలా? జగన్‌కే తెలియాలి. మొత్తానికి వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో జరిగిన దానికి శీతాకాలంలో జగన్ స్పందించారన్నమాట.
ప్రజావాణి చీదిరాల