YS Jaganmohan Reddy: కేసీఆర్ బాటలోనే జగన్..
ఒకరిని ఫాలో అవడమంటే మనల్ని మనం కోల్పోవడమే. ముఖ్యంగా నాయకులు అస్సలు ఒకరిని ఫాలో అవకూడదు. దీని కారణంగా తనకు అనుయాయులైన నేతలు, నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు.

ఒకరిని ఫాలో అవడమంటే మనల్ని మనం కోల్పోవడమే. ముఖ్యంగా నాయకులు అస్సలు ఒకరిని ఫాలో అవకూడదు. దీని కారణంగా తనకు అనుయాయులైన నేతలు, నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు. ఇదంతా ఎవరి గురించి అంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉండగా.. కేసీఆర్ బాటలో నడుస్తున్నారంటూ కొన్ని సందర్భాల్లో మాటలు వినిపించాయి. జగన్ తీరు చూస్తుంటే ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నారేమో అనిపిస్తోంది.
అసలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)తో జగన్ (YS Jaganmohan Reddy)కు ఇప్పుడేం పోలిక అంటారా? కేసీఆర్ అసెంబ్లీ మొహం చూస్తున్నారా? మరి జగన్ చూస్తున్నారా? ఈ విషయంలో జగన్ అయితే ఒకడుగు ముందుకేసి మరీ తన ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీకే వెళ్లనివ్వడం లేదు. ఇది మరీ దారుణం కదా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ (AP Assembly)కి వస్తామనడం ఎంతవరకూ కరెక్ట్? అధికారంలో ఉన్నప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను లాగితే వారికి ప్రతిపక్ష హోదాయే ఉండదంటూ సవాళ్లు విసిరి ఇవాళ పనికొచ్చే విషయాలను వీడి.. ప్రతిపక్ష హోదాపై పోరాటమా? హవ్వ.. నవ్విపోదురుగాక. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా సమస్యలపై మాట్లాడకుండా ఉంటే.. రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్టు కదా.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నట్టే కదా. మరెందుకు అడపాదడపా వచ్చి ఈ రాద్దాంతాలని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెబుతారు? సమస్యలు లేవని ఒప్పేసుకుంటారా? ఏదో రాద్దాంతం చేయాలి కాబట్టి చేస్తున్నాం అని చెబుతారా?
ఇదేం పద్ధతి?
ఇది చాలదన్నట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్ (KCR Farm House)కి పరిమితమవుతున్నట్టుగా... జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు ప్యాలెస్‌కి పరిమితమవుతున్నారు. ఒకవైపు వైసీపీ కార్యకర్తలు గతంలో అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (YSRCP Government) అధికారంలో ఉండగా.. అడ్డగోలుగా నోరు పారేసుకున్న నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ఏం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు. వారికి భరోసా ఇచ్చేదెవరు? అదే విషయాన్ని జగన్ వద్ద మొరపెట్టుకున్నా కూడా వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పటి వరకూ సేఫ్‌గా ఉండండి.. అప్పుడు చూసుకుంటానని చెబుతున్నారట. ఇదేం పద్ధతి? అసలు అధికారంలోకి వచ్చాక వాళ్లను ఇబ్బంది పెట్టేవారెవరుంటారు? అన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉంటే.. అసెంబ్లీకి వైసీపీ నేతలు (YCP Leaders) వెళ్లకుంటే మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. అసెంబ్లీకి హాజరవక పోవడానికి కూడా ఒక కాలపరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితి వరకూ వేచి చూసి తరువాత దానిని బూచిగా చూపి ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నిక పెడితే ఏం చేస్తారు?
ఉపఎన్నికకు జగన్ సిద్ధమా?
ఇప్పటికే ఏపీ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (AP Deputy Speaker Raghurama Krishnaraju) గతంలో అయితే ప్రతిపక్ష హోదా గురించి మారాం చేయడం మాని అసెంబ్లీకి రమ్మని వైసీపీ నేతలకు హితవు పలికారు. అయినా సరే.. వారు అసెంబ్లీలోకి అడుగు పెట్టింది లేదు. ఇక ఇటీవల మాస్ వార్నింగ్ కూడా ఒకటి ఇచ్చారు. కాల పరిమితిలోగా అసెంబ్లీకి రాకుంటే పులివెందుల (Pulivendula_లో ఉపఎన్నిక (Bypoll) పెడతామని గట్టిగానే చెప్పేశారు. మరి ఉపఎన్నికకు జగన్ సిద్ధమా? ఇప్పటికే పులివెందులలో వైసీపీకి గట్టి షాకే తగిలింది. ఇవన్నీ అవసరమా? అని వైసీపీ కార్యకర్తలు, నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్ (YS Jagan)కు కేసీఆర్ పూనాడో ఏమో కానీ అసెంబ్లీ గడప అయితే తొక్కేలా కనిపించడమే లేదు. కేసీఆర్ మాదిరిగానే ఎప్పుడో ఒకసారి కలుగులో నుంచి అలా బయటకు వచ్చి చూసి వెళుతున్నారని ఏపీ ప్రజానీకం అంటున్నారు. మరి జగన్ కనీసం తన పార్టీ నేతల మాటైనా వింటారా? అదీ కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. ఇకనైనా మారాలని అధినేతను కోరుతున్నారు.
ప్రజావాణి చీదిరాల