CM Chandrabau: ఏకంగా చంద్రబాబుకే నోటీసులా? ఇంతకీ ఎవరా శంకరయ్య?
ఏకంగా సీఎం చంద్రబాబునాయుడికే ఓ వ్యక్తి లీగల్ నోటీసులు పంపించారు. అసలు ఎవరా వ్యక్తి? ఎందుకు నోటీసులు పంపించారు? అనే విషయాలు తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోతారు.

ఏకంగా సీఎం చంద్రబాబునాయుడి (CM Chandrababu Naidu)కే ఓ వ్యక్తి లీగల్ నోటీసులు (Legal Notice) పంపించారు. అసలు ఎవరా వ్యక్తి? ఎందుకు నోటీసులు పంపించారు? అనే విషయాలు తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోతారు. అసలు విషయం ఏంటంటే.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Murder Case) అప్పట్లో ఎంత సంచలనమో చెప్పాల్సిన పని లేదు. ముందుగా వైఎస్ వివేకా (YS Viveka)ది గుండెపోటు అని మీడియాకు చెప్పారు. ఆ తరువాత హత్య అని తేలింది. ఈ విషయంలో అప్పటి పులివెందుల (Pulivendula) సీఐ నాటి వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి అండగా నిలిచారంటూ వార్తలొచ్చాయి. దీనిని పలుమార్లు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం గట్టిగానే చెప్పారు.
ఇన్నాళ్లకు శంకరయ్య తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు (Chandrababu) దురుద్దేశపూరితంగా పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే లాయర్ ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపగా మంగళవారం వెలుగులోకి వచ్చాయి. ఈ నోటీసుల్లో శంకరయ్య చంద్రబాబు తన ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు తనకు అసెంబ్లీ (AP Assembly)లో బహిరంగా క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య 2019 మార్చిలో జరిగింది. ఆ సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. అప్పట్లో వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా శంకరయ్య సమక్షంలోనే జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
చంద్రబాబు సైతం పలుమార్లు అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాలు ధ్వంసం చేయడంతో పాటు రక్తపు మరకలు కడిగేశారంటూ ఆరోపించారు. ఈ విషయమై శంకరయ్యను 2019లో అప్పటి ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. అప్పట్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy), ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (Devireddy Shivashankar Reddy) తనను బెదిరించారంటూ సీబీఐ (CBI)కి శంకరయ్య వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసు (Viveka murder case) నమోదు చేయవ్దని... అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం వంటివేమీ చేసేందుకు పంపవద్దని.. మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికీ చెప్పొద్దని తనను భయపెట్టారని సైతం సదరు వాంగ్మూలంలో వెల్లడించారు. మేజిస్ట్రేట్ ఎందుట వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం తనకు వేరే పనులున్నాయని హాజరుకాలేదు. ఆ తరువాత కేవలం వారం రోజుల్లోనే ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. తాజాగా శంకరయ్య సీఎం చంద్రబాబుకే నోటీసులు పంపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రజావాణి చీదిరాల