YS Jaganmohan Reddy: జగన్‌కు ధీమానా? లేదంటే పగటి కలలా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రమల నుంచి బయటకు వస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కొన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రమల నుంచి బయటకు వస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కొన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. అసలు ఇంతకీ ఎందుకు అలా అంటున్నారు.. అంటారా? ఎప్పుడైనా సరే.. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏమాత్రం మంచిది కాదు. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అని పార్టీని ముంచేశారని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఇక ఇప్పుడు దేవుడున్నాడు.. ఏపీ ప్రజానీకం చూస్తున్నారంటూ కొత్త రాగం..
అవును.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కొత్తరాగం అందుకున్నారు. ప్రతిసారి అదే పాట.. దేవుడున్నాడు.. ప్రజలు చూస్తున్నారని.. అలా చూసే కదా పార్టీని మట్టి కరిపించారు. ఇప్పటికైనా జనాల్లో ఉండకుండా పదే పదే అలాగే మాట్లాడుతూ పోతే ఎలా? జనాల్లో ఉండటం మానేసి బెంగుళూరు ప్యాలెస్ (Bengalore Palace)కే జగన్ పరిమితమవుతున్నారనేది ఏపీ ప్రజానీకం (AP People) అంటున్న మాట. ఏదైనా సందర్భం వస్తే ఇలా వచ్చి జనాలకు ఓ హాయ్ చెప్పేసి వెళుతున్నారు. ఇలా చేస్తూ దేవుడు చూస్తున్నాడంటే ఎలా? గాల్లో దీపం పెట్టి దేవుడా.. అంటే అవుతుందా? మన ప్రయత్నమూ ఉండాలి కదా.. కానీ జగన్ (Jagan) ప్రయత్నాలు మానేసి.. దేవుడిని తలుస్తున్నారు. తాజాగా జగన్ రెండున్నర గంటల పాటు మీడియా సమావేశం నిర్వహించారు.
జగన్ కోరిక ఎలా నెరవేరుతుంది?
ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రశ్నలకు సైతం జవాబు చెప్పే కార్యక్రమాన్ని జగన్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ (BJP) విషయాన్ని అయితే ప్రస్తావించలేదు కానీ ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)పై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఎందుకో ఈసారి పవన్ (Pawan Kalyan) గురించి కూడా పెద్దగా జగన్ ఏమీ మాట్లాడలేదు. మరి జగన్ ఏం మాట్లాడారంటారా? పదే పదే వచ్చే ఎన్నికల్లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే (YCP Government)నని చెప్పారు. తప్పనిసరిగా 2029 ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. అసలు జగన్‌కు ఎందుకింత ధీమా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకుంటే ఏమైనా ఆశ పెట్టుకోవచ్చు కానీ రోజురోజుకీ ఆ ప్రభుత్వానికి జనాదరణ పెరుగుతోంది తప్ప తరగడం లేదు. అలాంటప్పుడు జగన్ కోరిక ఎలా నెరవేరుతుంది? పోనీ జగన్ ఏమైనా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అంటే అదీ లేదు. అప్పుడేమో పరదాల మాటున ఉండేవారు. ఇప్పుడు బెంగుళూరులోనే ఉంటున్నారు. అసలు జనాలకు దగ్గరగా లేనప్పుడు వైసీపీకి ప్రజాదరణ ఎలా దక్కుతుంది? ఎలా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది?
యథా రాజ.. తథా ప్రజ..
ఇవన్నీ పక్కనబెడితే ఇద్దరు, ముగ్గురు వైసీపీ నేతలు (YCP Leaders) తప్ప ఎవరు అసలు వైసీపీ తరుఫున మాట్లాడుతున్నారు? అప్పట్లో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. జగన్‌ను మెప్పించేందుకో మరో కారణమో కానీ వైసీపీ నేతలంతా (YCP Leaders) వన్ బై వన్ మీడియా ముందుకు వచ్చేవారు. ఇష్టానుసారంగా నోరు పారేసుకునేవారు. ప్రస్తుతం వారంతా జనాలకు కనిపించడమే మానేశారు. అధినేతే జనాలకు కనిపించకుంటే.. నేతలెక్కడ కనిపిస్తారు. యథా రాజ.. తథా ప్రజ.. ఒకవైపు మరో పదిహేనేళ్ల పాటు వైసీపీకి ఛాన్స్ ఇచ్చేదే లేదని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ తెగేసి మరీ చెబుతుంటే.. జగన్ మాత్రం దేవుడు చూస్తున్నాడు.. జనాలు ఏదో చేస్తారంటూ కాలం గడుపుతున్నారు. అసలు జగన్ నిజంగా మనస్ఫూర్తిగా అలా మాట్లాడుతున్నారా? లేదంటే ఏదో తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకు మాట్లాడుతున్నారా? అనేది అర్థం కావడం లేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తానికి ప్యాలెస్‌లో కూర్చొని జగన్ అయితే పగటి కలలు కంటున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల