Politics

CM Chandrababu: వైఎస్ జగన్ ‘లెక్క’ను చంద్రబాబు కాపీ కొడుతున్నారా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో సంఘ సంస్కర్త అన్నట్టుగా.. విజనరీకి ఐకాన్ అన్నట్టుగా చెబుతూ.. వైఎస్ లెక్క తప్పదంటూ చేస్తున్న రచ్చ చూస్తుంటే.. ఆ పార్టీ నేతలు సైతం విస్తుబోతున్నారు. బోడిగుండుకి.. మోకాలుకి ముడిపెడితే ఎలా ఉంటుందో.. మూడు రాజధానులకు.. మూడు జోన్‌లకు ముడిపెట్టినా అలాగే ఉంటుంది.

CM Chandrababu: వైఎస్ జగన్ ‘లెక్క’ను చంద్రబాబు కాపీ కొడుతున్నారా?

అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినప్పుడు, దానిని తుగ్లక్ నిర్ణయం అన్న చంద్రబాబు, ఇప్పుడు దాదాపు అదే బాట పడుతున్నారంటూ వైసీపీ నేతలు, క్యాడర్ నానా రచ్చ చేస్తున్నారు. విపరీతమైన సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

తాజాగా, ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం, అమరావతి, రాయలసీమ ప్రాంతాలను మూడు జోన్‌లుగా విభజించి, ఒక్కో జోన్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారిని సీఈఓగా (యువరాజ్, మీనా, కృష్ణబాబు) నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. జగన్ మోహన్ రెడ్డిని అచ్చుగుద్దినట్లుగా ఫాలో అవుతున్నారంటూ వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు విజనరీ ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా 40 ఏళ్ల అనుభవం వైసీపీ నేతలు చంద్రబాబును కార్నర్ చేసేందుకు యత్నిస్తున్నారు.

జగన్‌కు చంద్రబాబుకు పోలికా?

‘జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు చేయడం.. చంద్రబాబు మూడు జోన్‌లుగా విభజించడం ఒక్కటేనా? దీనికెందుకు అంతలా రచ్చ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో సంఘ సంస్కర్త అన్నట్టుగా.. విజనరీకి ఐకాన్ అన్నట్టుగా చెబుతూ.. వైఎస్ లెక్క తప్పదంటూ చేస్తున్న రచ్చ చూస్తుంటే.. ఆ పార్టీ నేతలు సైతం విస్తుబోతున్నారు. బోడిగుండుకి.. మోకాలుకి ముడిపెడితే ఎలా ఉంటుందో.. మూడు రాజధానులకు.. మూడు జోన్‌లకు ముడిపెట్టినా అలాగే ఉంటుందనేది అక్షర సత్యం. రాజధానిగా ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి.. మూడు రాజధానులు పేరిట.. వైజాగ్‌ను ఏదో చేద్దామనుకుని.. తనకు మాత్రం రిషికొండపై ప్యాలెస్ కట్టుకున్న జగన్‌కు చంద్రబాబుకు పోలికా? హవ్వ.. నవ్విపోదురుగాక... పైగా జగన్‌ను చంద్రబాబు కాపీ కొడుతున్నారట. అసలు జగన్ ఏం చేశారని కాపీ కొడతారు? ప్రస్తుతం కొత్తగా తెచ్చిన ఈ జోనల్ వ్యవస్థ ద్వారా సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహిస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి గండి కొట్టేందుకు వైసీపీ యత్నిస్తున్నట్టుగానే ఉంది. ప్రభుత్వం చెబుతోంది. విశాఖ, అమరావతి, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలనా సమర్థత మెరుగుపడుతుందని, లక్షిత ప్రాంతీయ వృద్ధికి అవకాశం లభిస్తుందని ప్రభు

అమరావతి మడత!

ఈ కొత్త వ్యవస్థ ద్వారా వనరుల కేటాయింపు మెరుగుపడటానికి దోహదపడుతుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయినా కూడా ఈ జోనల్ వ్యవస్థ వల్ల పాలనాపరమైన పొరలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు తలెత్తకుండా ఉండాలంటే సీఈఓల మధ్య సమన్వయం చాలా అవసరమని హెచ్చరిస్తున్నారు. కేవలం దీనిని కీడెంచి మేలెంచడంగానే చూడాలి. దీనికి సంబంధించి మరింత జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. చంద్రబాబును నమ్మడానికి జనం సిద్ధంగా లేరని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అలా నమ్మకుంటే చంద్రబాబు అన్ని సీట్లు ఎలా వస్తాయి? వైసీపీ కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుందంటే.. జనాలు ఎవరిని నమ్మనట్టు? పైగా చంద్రబాబు.. అమరావతిలో లక్ష ఎకరాలు మడతెట్టినట్టుగానే, మిగతా ప్రాంతాలలో లక్ష ఎకరాల చొప్పున మడత పెట్టడానికి సిద్ధమయ్యారంటూ వ్యంగ్య అస్త్రాలు. ఇంకా జగన్ ప్రభుత్వంలోనే ఉన్నామనే భ్రమలో వైసీపీ నేతలు ఉన్నట్టున్నారు.. ఇది కూటమి ప్రభుత్వమంటూ టీడీపీ క్యాడర్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నామనే భ్రమలో పడిపోయి.. జగన్ మడత పెట్టినట్టు.. అంతా మడతపెడతారనే భ్రమలో ఉన్నట్టున్నారంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 1, 2025 2:54 PM