Kodali Nani: కొడాలి నాని రాజకీయ భవిష్యత్‌పై ఇంట్రస్టింగ్ ప్రచారం..
కొడాలి నాని విషయంలో రెండో ప్రధాన అడ్డంకి ఆయన అనారోగ్యం. ఇప్పటికే అనారోగ్య కారణాలతో గత 18 నెలలకుపైగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తాజాగా సంక్రాంతి వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు.
కొడాలి నాని విషయంలో రెండో ప్రధాన అడ్డంకి ఆయన అనారోగ్యం. ఇప్పటికే అనారోగ్య కారణాలతో గత 18 నెలలకుపైగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తాజాగా సంక్రాంతి వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేస్తానని చెప్పినా, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చన్న చర్చ సాగుతోంది. మరోవైపు నానికే పోటీ చేసే ఆసక్తి తగ్గిందన్న మాట కూడా వినిపిస్తోంది.
ఆయన స్వీకరిస్తారా?
ఈ పరిస్థితులన్నింటిని పరిశీలిస్తే, కొడాలి వ్యవహారంపై వైసీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని బరిలోకి దించేందుకు చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే కొడాలి నానికి ఇక రాజకీయ సన్యాసం తప్పనట్లే. మరోవైపు ఆయనకు వైసీపీలో ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చే అవకాశముందని సైతం చర్చ జరుగుతోంది. అయితే అసెంబ్లీ సీటు ఇవ్వకుండా ఇలా గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే ఆయన స్వీకరిస్తారా? అనేది కూడా ప్రశ్నార్థకమే. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఎన్నికల తర్వాత కొడాలి నానిని రాజ్యసభకు కానీ.. మండలికి కానీ పంపే అవకాశాలున్నట్టు సైతం టాక్ నడుస్తోంది.
జగన్ ఆలోచిస్తారేమో..
మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. అసలు కొడాలి నాని తన నియోజకవర్గానికి వచ్చి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఏదైనా సాధ్యపడుతుంది. అది కాదని.. హైదరాబాద్‌కే పరిమితమైతే మాత్రం కనీసం రాజ్యసభ లేదంటే మండలిలో అవకాశం కల్పించాలన్నా వైసీపీ అధినేత జగన్ ఆలోచిస్తారేమో. పైగా పార్టీ ఓటమి పాలైన నాటి నుంచి కొడాలి నాని దాదాపుగా మీడియా ముందుకు వచ్చిందే లేదని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా.. కొడాలి నాని నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇష్టానుసారంగా అప్పటి విపక్ష పార్టీలపై నోరేసుకుని పడిపోయేవారు. టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబును అయితే దారుణంగా మాట్లాడేవారు. ప్రస్తుతం కొడాలి నాని హైదరాబాద్‌లో సెటిల్ అయిపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పాలి.
కొడాలి నానిని మరిచిపోయారా?
అరెస్ట్ భయంతో కొడాలి నాని హైదరాబాద్‌కు పరిమితమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం కూడా ఒక కారణమనే చెబుతున్నారు. కానీ ఆరోగ్యం కుదుట పడినా కూడా ఆయన ఏపీ వైపు చూడటం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీ కేడర్ అయితే కొడాలి నాని ఉన్నారనే విషయం కూడా మరిచిపోయారట. ఇప్పటికైతే కొడాలి నాని రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి తిరిగి ఏపీకి వచ్చి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారేమో చూడాలి. మొత్తానికి కొడాలి నాని రాజకీయ భవిష్యత్ అనేది 2029 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందనేది మాత్రం వాస్తవం.