Pawan Kalyan: పిఠాపురంలో గొడవలు సృష్టిస్తే.. తిష్టవేసి ఏరిపారేస్తా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కాకినాడ జిల్లా పిఠాపురం ( Pithapuram ) నియోజకవర్గంలో నేడు (శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కాకినాడ జిల్లా పిఠాపురం ( Pithapuram ) నియోజకవర్గంలో నేడు (శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే సుమారు రూ.3 వందల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలోనూ పవన్ పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గలో ఎవరైనా గొడవలు సృష్టించేందుకు యత్నిస్తే సహించబోనన్నారు. పిఠాపురంలోనే తిష్టవేసి ఏరి పారేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
పిఠాపురం నియోజకవర్గంలో కాకి ఈక పడినా కూడా ఏదో జరిగిపోయిందంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పవన్ ఫైర్ అయ్యారు. పులివెందులలో సొంత బాబాయ్ వైఎస్ వివేకను చంపినా అది వార్త కాదు కానీ.. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అదొక పెద్ద వార్తగా క్రియేట్ చేస్తున్నారన్నారు. సంక్రాంతి పండుగ అంటే కేవలం కోళ్ల పందేలు, జూదాలే కాకుండా ప్రేమను పంచాలన్నారు. ఈ క్రమంలోనే కూటమితో ఎప్పటి వరకూ కలిసి ఉండే విషయమై స్పష్టతనిచ్చారు. అభివృద్ధి లక్ష్యం నెరవేరే వరకూ కూటమితో కలిసి ఉంటామని.. దానిలో ఎలాంటి సందేహమూ లేదన్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టైతే తాను రాజకీయాల్లోకి రాబోనన్నారు.