Chanrababu: రాజకీయ రౌడీలను ఉపేక్షించను
‘రాజధాని కోసం పొన్నూరును ముంచేశారు.. ఊళ్లు మునిగిపోతున్నాయ్.. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడింది..’ ఆగండి.. ఆగండి.. భయపడిపోకండి.. ఇవన్నీ నిజాలు కాదు..

‘రాజధాని (Capital) కోసం పొన్నూరును ముంచేశారు.. ఊళ్లు మునిగిపోతున్నాయ్.. ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) ప్రమాదంలో పడింది..’ ఆగండి.. ఆగండి.. భయపడిపోకండి.. ఇవన్నీ నిజాలు కాదు.. అభూత కల్పనలు.. వైసీపీ (YCP) చేస్తున్న అసత్య ప్రచారాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. వీటిపై నేడు (సోమవారం) చంద్రబాబు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. వైసీపీ తన మీడియా సంస్థల ద్వారా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందంటూ ఆయన విరుచుకుపడ్డారు. నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ పని అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ తన సొంత మీడియా (Media), పత్రికలు, అనుబంధ మీడియాలో ఏపీ ప్రజానీకాన్ని అసత్య కథనాలను వండి వార్చుతోందని చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు (Ministers), ఎంపీలు (MP), ఎమ్మెల్యేలు (MLA), ఎమ్మెల్సీ (MLC)లు, టీడీపీ నేతల (TDP Leaders)తో సీఎం టెలికాన్ఫరెన్స్ (Chandrababu Tele-conference) నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’, పార్టీ కమిటీల నియామకంపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రతి ఒక్క విషయంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని.. ఈ క్రమంలోనే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ ఖండించకుండా వదిలేస్తే.. అవే నిజమని ప్రజలను నమ్మించేందుకు సైతం వెనుకాడరని చంద్రబాబు తెలిపారు. రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. నాయకుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా మీ మాట, చర్యలు ఉండాలని.. వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని చంద్రబాబు తమ పార్టీ నేతలకు తెలిపారు. పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) విజయానికి కృషి చేసిన నేతలను ఆయన అభినందించారు.