Politics

Nimmala Ramanaidu: ర్యాంకుల్లోనే కాదు.. రియల్‌గానూ ఆయనొక లెజెండే

ర్యాంకుల్లోనే కాదు.. రియల్‌గానూ ఆయనొక లెజెండే. పెద్దవాళ్లను కనిపెట్టుకుంటే కుదరదు. పేదవాళ్లను కాచుకున్నవాడే నిజమైన నాయకుడు. ఆయన్ను మాత్రం నాయకుడు అనకూడదట.

Nimmala Ramanaidu: ర్యాంకుల్లోనే కాదు.. రియల్‌గానూ ఆయనొక లెజెండే

ర్యాంకుల్లోనే కాదు.. రియల్‌గానూ ఆయనొక లెజెండే. పెద్దవాళ్లను కనిపెట్టుకుంటే కుదరదు. పేదవాళ్లను కాచుకున్నవాడే నిజమైన నాయకుడు. ఆయన్ను మాత్రం నాయకుడు అనకూడదట. నాయకుడని జనాల నుంచి దూరం పెట్టవద్దని పలువురు హితవు పలుకుతున్నారు. వాస్తవానికి ఆయన అధినేత మెచ్చిన మనిషి.. జనం నచ్చిన మనిషి. ఏ నాయకుడైనా ఫ్లవర్ బొకేలను తీసుకొస్తే వద్దంటారా? ఈయన మాత్రం వద్దంటారు. కూరగాయలో పండ్లో కావాలంటారు. అవి ఆ తరువాత ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయన్నది ఆయన ఆలోచన. వాట్ ఏన్ ఐడియా సర్ జీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu).. పనితీరు, శాఖలపై వారికి ఉన్న పట్టు ఆధారంగా మంత్రులకు ర్యాంకులను కేటాయించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారంగా చూస్తే ఏపీ మంత్రుల్లో నంబర్ 1 స్థానంలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఉన్నారు. ఆయన పనితీరుకు ఈ ర్యాంకులు అయితే కొలమానం కాదు. మరి ఏంటంటారా? ఎక్కడికి వెళ్లినా కూడా నిమ్మలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఉన్నవారిని ఎవరైనా దగ్గరకు తీస్తారు. కానీ నిరుపేదలను దగ్గరకు తీయడంతోనే ఆ నేత గొప్పదనం బయటపడుతుంది. వృద్ధులైతే తనను వెదుక్కుంటూ వచ్చిన వారికి అవసరమైన తక్షణ సాయం అందిస్తారు. అంతేకాకుండా డబ్బులు ఇచ్చి మరీ వారిని ఇంటికి సాగనంపుతారు. ఈయన పెట్టిన కొత్త రూల్. తన దగ్గరకు వచ్చేవారు ఒకవేళ ఏమైనా బొకే (Flower bouquet)తో రావాలి అనుకంటే మాత్రం దాని ప్లేసులో కూరగాయలు తీసుకుని రమ్మని చెప్పారు.

చాలా మంది కూరగాయల (Vegetables)తోనో లేదంటే పండ్ల (Fruits)తోనో నిమ్మల దగ్గరకు వస్తున్నారు. అలా రావడంలో ఆయన కృషి చెప్పుకుని తీరాల్సిందే. వాటిని అవసరమైన వారికి అందజేస్తారు. ఒక మంచి ఆలోచన ఇది. అలాగే ఎక్కడికైనా పెద్దగా ఆర్భాటాలు అంటే సెక్యూరిటీ వంటివేమీ లేకుండానే వెళుతుంటారు. ప్రతి ఒక్క నాయకుడూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది? వాస్తవానికి మంత్రి అంటే చాలా మంది సెక్యూరిటీతో హడావుడి చేస్తుంటారు. కానీ నిమ్మల మాత్రం రివర్స్. ఎలాంటి హడావుడి ఉండదు. ఎవరినైనా చాలా ఆప్యాయంగా దగ్గరకు తీస్తారు. దీనికి సంబంధించిన ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫైళ్లను సైతం క్లియర్ చేస్తూ ది బెస్ట్ నేత అనిపించుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరితోనూ సున్నితంగా ఉంటడం ఆయన నైజం. అందుకేనేమో వైసీపీ (YCP) హవా నడుస్తున్న సమయంలోనూ ఆయన విజయాన్ని అడ్డుకోవడం వారి తరం కాలేదు. ఇలాంటి నేతలు మరికొంతమంది ఉంటే ఏ రాష్ట్రమైనా చాలా బాగుంటుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 12, 2025 10:48 AM