Politics

Telangana News: తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక వచ్చేసింది..

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గతంలో 30.03 శాతం నుంచి 33.67 శాతానికి డీఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Telangana News: తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక వచ్చేసింది..

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గతంలో 30.03 శాతం నుంచి 33.67 శాతానికి డీఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2023 జులై 1 నుంచి ఈ పెరిగిన డీఏ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జనవరి నెల వేతనంతో పెరిగిన డీఏను ప్రభుత్వం ఫిబ్రవరి 1న చెల్లించనుంది. ఇక మిగతా బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయనుంది.ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ. 227 కోట్ల భారం పడనుంది.

డీఏతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రంలోని రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల బకాయిలను సైతం త్వరలో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పదవీ విరమణ ప్రయోజనాలను సైతం సాధ్యమైనంత త్వరగా అందిస్తామని రేవంత్ తెలిపారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 12, 2026 1:47 PM